30.3 C
Hyderabad
September 23, 2026
ప్రత్యేకంహోమ్

దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం

#ReserveBankOfIndia

దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. . సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27, ఆదివారం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

26, 27 తేదీలు వారాంతపు సెలవులు కాగా, ఆ వెంటనే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె ప్రారంభం కానుంది. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు సెప్టెంబర్ 27న కూడా బ్యాంకులను పనిచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బ్యాంకింగ్ అవసరాలు సుదీర్ఘకాలం పాటు ప్రభావితం కాకుండా ఉండేందుకు సెప్టెంబర్ 27న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశాయి. అత్యవసర బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

రిజర్వు బ్యాంకు అనుమతితో సాధారణ బ్యాంకు శాఖలతో పాటు కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, నగదు నిల్వ కేంద్రాలు కూడా సెప్టెంబర్ 27న పనిచేయనున్నాయి. దీంతో అదనపు పనిదినంగా ఆదివారం బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

మూడు రోజుల సమ్మెకు ముందు వచ్చే వారాంతపు సెలవులతో కలిపి బ్యాంకింగ్ సేవలు సుదీర్ఘంగా నిలిచిపోయే పరిస్థితిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సమ్మెకు ముందు ఖాతాదారులు తమకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ఈ అదనపు పనిదినం అవకాశం కల్పించనుంది.

Related posts

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

ఇక పిల్లలకు నో సోషల్ మీడియా…..

Satyam News

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

Satyam News

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News

షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ

Satyam News

Leave a Comment