హైదరాబాద్హోమ్

భూ కబ్జాదారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు: రంగ‌నాథ్ (హైడ్రా)

#RanganathIPS

తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసి తొలగించాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఆ వివరణ పూర్తి పాఠం ఇది:

నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు ( 17 బిలియన్ డాలర్లు).  ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం.

మరో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రా కు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పు దోవ పట్టిస్తున్నారు.

లోతుకుంట భూమి విషయం లో దాదాపు పది వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్స రాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్ల‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా లేకుండా విచ్చల విడిగా విధ్వంసం చేసింది.

Save the Rocks Society,  పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగం లో కి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డ‌ర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది.

నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బ‌తుక‌మ్మ‌ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్య‌లో ఉన్న‌ సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లా రెడ్డి, క్రిమినల్ మాఫియా గా చెలామణి అవుతూ రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం..  వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు.

వీళ్ళు  అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగా నే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుండి 100% ఫ‌లితాలు ఇవ్వటానికి  పని  చేస్తున్నాను, చేస్తాను.

ఏవీ రంగ‌నాథ్‌, హైడ్రా క‌మిష‌న‌ర్‌.

Related posts

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

మెగా వారసుడికి పేరు పెట్టారు….

Satyam News

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

నాగర్‌కర్నూల్‌లో ఉపాధి హామీ పనులు వేగవంతం

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

Leave a Comment