ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

#ModiSocialMedia

ప్రధాని నరేంద్రమోడీని అత్యంత పరుష పదజాలంతో విమర్శించిన ఒక 15 ఏళ్ల బాలిక ఆయనకు క్షమాపణ చెప్పింది. వీడియోలో మాట్లాడిన ఆ బాలిక, “జూలైలో నేను నా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు వెళ్లాను. అక్కడ ప్రధానమంత్రిపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలంతో మాట్లాడుతున్న కొందరిని చూశాం. వారు నన్ను ప్రభావితం చేసి, అదే పదాలను పలకాలని ప్రోత్సహించారు. వారి మాటలకు లోనై నేను కూడా అలా మాట్లాడాను” అని తెలిపింది.

తాను చేసిన పనికి తీవ్రంగా సిగ్గుపడుతున్నానని, ఎవరి కళ్లలోకి చూసే పరిస్థితి లేదని పేర్కొంది. “దేశ ప్రజలందరూ నన్ను క్షమించాలి. నాకు కేవలం 15 సంవత్సరాలే. ఇది నా జీవితంలో మొదటి, చివరి తప్పు. ఇలాంటి పని మళ్లీ ఎప్పటికీ చేయను” అని వీడియోలో విజ్ఞప్తి చేసింది.

ఈ క్షమాపణ వీడియో వెలువడటానికి ముందు, బాలికపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జూలై 29న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ముందుగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఘటన దేశ రాజధానిలో జరిగినందున ఆ ఎఫ్‌ఐఆర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో స్పందించారు. తనపై మాత్రమే కాకుండా తన దివంగత తల్లిపై కూడా జంతర్ మంతర్ నిరసన సందర్భంగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని అన్నారు. అయితే, “దారి తప్పిన పిల్లలను క్షమించి, సరైన మార్గంలో నడిపించాలి” అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, వైరల్ వీడియో వ్యాప్తిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీడియోను తొలగించాలని సోషల్ మీడియా వేదిక Xకు నోటీసులు జారీ చేయడంతో పాటు, దర్యాప్తులో భాగంగా సంబంధిత ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు.

Related posts

రోయింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటిన తెలంగాణ

Satyam News

రంపచోడవరం అడవి ప్రాంతంలో పులి సంచారం

Satyam News

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News

విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

Satyam News

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

Satyam News

Leave a Comment