విశాఖపట్నంహోమ్

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

#Traibals

విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసులు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలితో పాదయాత్ర నిర్వహించారు.

జాజులుబండ, పిట్రిగడ్డ, నీళ్లుబండ, పెదగరువు తదితర కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పీవీటీజీ (PVTG) వర్గాల ప్రజలు కనీస రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అత్యవసర వైద్యం కోసం సుమారు 20 కిలోమీటర్లు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొండ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసులు కోరారు.

ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆదివాసుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

సమాజంలో మీడియా పాత్ర కీలకమైనది

Satyam News

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ  డైరీ ఆవిష్కరణ

Satyam News

కేసీఆర్ పై హరీష్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు

Satyam News

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తాం

Satyam News

హైడ్రాలిక్ ఎక్స్కవేటర్‌తో గుర్రపు డెక్క తొలగింపు

Satyam News

Leave a Comment