ఆదిలాబాద్హోమ్

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

#EtalaRajendar

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతన్న మీద పగబట్టి ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదు. నాలుగు రోజుల నుంచి మేము తిరుగుతున్నాము ఎక్కడికి వెళ్లినా ఒకటే వేదన ఒకటే దుఃఖం ఇంత శిక్ష ఈ ప్రభుత్వం ఆ మీద ఎందుకు వేస్తుందని రైతులు ఏడుస్తున్నారు అని బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

” రైతు గోస బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ లో రైతులతో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీజేఎల్పీ లీడర్ మహేష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడారు. మీరు వస్తున్నారని తెలియగానే బస్తాలు వస్తున్నాయి లారీలు వస్తున్నాయి.. మీరు తిరుగుతుంటే మాకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.

వరి ధాన్యం మక్కలు తెల్ల జొన్నలు గోదాములకు చేరుకునేంతవరకు మీ యాత్ర ఆపవద్దు అని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మూర్ఖంగా అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఊహించలేదు. తెల్ల జొన్నలు ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటామని ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా అని రైతులు అడుగుతున్నారు.

అసలు వ్యవసాయ పట్ల వీరికి అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మొక్కజొన్నలు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుంటే ఇరవై ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే కొంటామని ప్రభుత్వం ప్రకటిస్తే మిగిలిన మక్కలు ఎక్కడ అమ్ముకోవాలి. సన్ ఫ్లవర్ 5 వేలకు కొనే దిక్కులేదు.. నూనె గింజలు పండించండి అనే ప్రకటించావు కదా ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తున్నాను అని ఈటల రాజేందర్ అన్నారు.

రేవంత్ 2034 వరకు నేనే సీఎం అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాలు విసురుతున్న. దద్దమ్మ ప్రభుత్వం ఎన్నుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రతి గింజ కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నాము అని ఈటల రాజేందర్ అన్నారు.

ఖానాపూర్ లో తడిచి మొలకెత్తిన ధాన్యం ను బీజేపీ నేతలు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు సెంట్రల్ జైళ్లుగా మారాయి.. ఇక్కడకి వచ్చిన వాళ్ళం ఇక్కడే మగ్గి పోతున్నాం. నరకం అనుభవిస్తున్నాం. ఇలానే అయితే వ్యవసాయం బంద్ చేస్తాం అని వాపోయిన రైతులు. దిక్కు లేక వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు.

మార్కెట్ కి వచ్చినప్పటి నుండి పైసలు పడేదాక  గోస పడుతున్నాం అని రైతులు అన్నారు. సీఎంలు ఎమ్మెల్యేలు అందరూ మేము రైతు బిడ్డలం అని చెప్పుకోవడమే తప్ప ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించు కోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుండి పెళ్ళాం పిల్లలం అందరం ఇక్కడే ఉంటున్నాం. హమాలీలు లేరు, లారీలు లేవు. ఇంత ఘోరం ముందెన్నడూ చూడలేదని రైతులు వివరించారు.

Related posts

బాసర ఆలయ అభివృద్ధి పనులకు 6న శంకుస్థాపన

Satyam News

నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి

Satyam News

శ్రీశైలంలో ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Satyam News

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News

స‌మ‌స్య ఎవ‌రు చెప్పినా ప‌రిష్క‌రించ‌డ‌మే ప్ర‌ధానం

Satyam News

ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Satyam News

Leave a Comment