అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్ చేస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డుని చాలా వరకు మలుపులు లేకుండా స్ట్రయిట్‌గా నిర్మించారు. కానీ కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నుంచి.. బకింగ్‌హామ్ కెనాల్‌పైన ఉన్న స్టీల్ బ్రిడ్జి వరకు రోడ్డు పెద్ద మలుపు తీసుకొంటుంది.
భూసేకరణలో ముఖ్యమైన నాయకుల ఆస్తులు పోకుండా చూడటానికే.. సీడ్ యాక్సెస్ రోడ్డుని మలుపులు తిప్పారని వైసీపీ మీడియా ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి డీవియేషన్ లేదని.. భవిష్యత్తు అవసరాలు, ఫేజ్ 3 అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే.. బకింహామ్ కెనాల్ దగ్గర సీడ్ యాక్సె రోడ్డుని ములుపులతో నిర్మించారని.. ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది.
ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాలంటే.. సీడ్ యాక్సెస్ రోడ్డుని మూడు ఫేజ్‌లుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి రెండో ఫేజ్ వరకు పనులు పూర్తయ్యాయి. మూడో ఫేజ్‌లో భాగంగా ఉండవల్లి నుంచి తాడేపల్లిలోని మణిపాల్ హాస్పటల్ దగ్గర నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేస్తూ రోడ్డు నిర్మిస్తారు. ఈ ఫేజ్ త్రీ కోసమే బకింగ్‌హామ్ కాలువ దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డుని ములపులు తిప్పాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నారు. ఇప్పుడే స్ట్రెయిట్‌గా రోడ్డు వేసేస్తే.. అది ఫేజ్ త్రీ కనెక్టింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా మారుతుంది. అందుకే మూడో ఫేజ్ నిర్మాణం పూర్తయ్యే వరకు.. తాత్కాలికంగా సీడ్ యాక్సెస్ రోడ్డుని విజయవాడ, మంగళగిరి ప్రధాన రహదారితో అనుసంధానించడానికి రోడ్డు కర్వ్ తీసుకోవాల్సి వచ్చింది.
ఔటర్ రింగ్ రోడ్డులు, హైవే ఇంటర్‌ఛేంజ్‌ల దగ్గర ఇలాంటి మలుపుల దారులు సర్వ సాధారణం. కాకపోతే సీడ్ యాక్సెస్ రోడ్డులో మెయిన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముందే.. ఇంటర్‌ఛేంజ్‌లాంటి నిర్మాణం పూర్తి చేయడం వల్ల.. అసలైన రోడ్డు మలుపు తిప్పినట్లు కనిపిస్తుంది. కానీ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ప్రారంభమై.. బకింగ్‌హామ్ కెనాల్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు.. లేదా.. మంగళగిరి వైపు వెళ్లాలి అనుకోవారికి.. కరకట్ట రోడ్డుపైకి వెళ్లడానికి.. ఈ కర్వ్డ్ రోడ్డు ఇంటర్‌ఛేంజ్‌లా పని చేస్తుంది. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డుని ప్రకాశం బ్యారేజీకి కనెక్ట్ చేయడంతో పాటు ఫ్యూచర్‌లో కరకట్ట రోడ్డు.. మంగళగిరి రోడ్డులతో అనుసంధానిస్తుంది. దీని వల్ల ట్రాఫిక్ తగ్గడంతో పాటు.. మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుంది.
