ప్రత్యేకంహోమ్

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

#AshokGajapatiRaju

విజయనగరం లో స‌ర్ విజ్జి స్టేడియంను గోవా గ‌వ‌ర్న‌ర్ ఆశోక్ గ‌జ‌ప‌తిరాజు సోమవారం ప‌రిశీలించారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత పొద్దున్నే వాక్ థాన్ చేసారు.దాదాపు 60 ఎక‌రాల  విస్తీర్ణంలో నిర్మించిన విజ్జీ స్టేడియం ఇన్నాళ్ల‌కు అదీ స్పోర్ట్ కు, భావిత‌రాల‌కు అంది వ‌చ్చే విధంగా రూపుదిద్దుకోవ‌డం ,ర‌న్నింగ్ లో ఉండ‌టం ఆనందదాయ‌క‌మ‌న్నారు గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు.

ఆంధ్రా క్రికెట్ అధ్య‌క్షులు,విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు,,రామంద్ర‌రావుల‌తో క‌లిసి విజ్టీ స్టేడియం మొత్తం ఏడుప‌దుల వ‌య‌స్సులో గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు న‌డిచి ఆంద‌రికీ ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు.

ఈ సంద‌ర్బంగా గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ ముస‌లి వ‌య‌స్సున‌కు వ‌చ్చాన‌ని చెబుతూ త‌న త‌లపై టోపీ చేసి ఇదీ నా ప‌రిస్తితి అని చూపిస్తూ…అంద‌ర‌మూ ఎప్పుడొ ఒక‌ప్పుడు వెళ్లిపోవాల‌ని, తాను కూడా రేపో,మాపో వెళ్లిపోతాన‌ని అయితే వెళ్లిపోయేలోగా ప్ర‌జ‌ల‌కుమేలు, మంచి జ‌రిగే ప‌నులు చేసి వెళ్లిపోవ‌డం ప్ర‌తీఒక్క‌రి బాధ్యత  అని అన్నారు.

గ‌త పాల‌కుల హాయంలోనే ఈ విజ్జీ స్టేడియం ఎంత ప్రాచుర్యం పొందింతే  తాను చెప్ప‌క్క‌ర్లేద‌న్నారు.అనంత‌రం స్థానిక క్రీడా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అందులో ముఖ్యాంశాలు విజ్జి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  క్రికెట్, టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, ఇండోర్ స్టేడియమ్స్, రన్నింగ్ ట్రాక్స్ తదితర క్రీడ గ్రౌండ్స్ ను పరిశీలించి వాటి పనితీరును, అభివృద్ధి తదితర అంశాలపై  జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్తులో చేయబోయే విజ్జి స్టేడియం అభివృద్ధి కార్యచరణ పై తీసుకున్న నిర్ణయాల గురించి చ‌ర్చించారు. అన్నీ ఫార్మేట్ లలో క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, నైపుణ్యం కలిగిన వారు అవకాశాలు అందుపుచ్చుకోగలిగితే దేశాభివృద్ధికి, ఖ్యాతికి  దోహదపడుతుందన్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుండి ముఖ్యంగా యువకులు క్రికెట్ పైన మక్కువ తో  క్రీడలలో రాణించగల ఆణిముత్యాలను వెలుగు తీసే విధంగా ఫార్మేట్లను రూపొందించి  దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా విజయనగరం ఏసీఏ ప్రణాళికలు రూపొందించాలని తదితర విషయాలపై సమీక్ష సమావేశం జ‌రిగింది.

అనంత‌రం  క్రీడల్లో రాణించిన వారికి గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు,విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడులు క్రికెట్ బ్యాట్ లు, చెక్కుల‌ను బ‌హ‌క‌రించారు.

Related posts

సోషల్ మీడియాపై నిషేధం: ఒక సంచలనం

Satyam News

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

Satyam News

జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4064.59 కోట్లు

Satyam News

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

IOC నాయకుడు హర్భజన్ సింగ్ మృతి పట్ల సంతాపం

Satyam News

Leave a Comment