గుంటూరుహోమ్

నర్సరావుపేట జేఎన్ టీయూకే నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

#NaraLokesh

పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన వసతి గృహాలను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి.సంజనా సిమ్హా, జేఎన్ టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు

Satyam News

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ

Satyam News

రాజధాని మార్చినప్పుడు సైలెన్స్… జిల్లా కేంద్రంపై వైసీపీ రచ్చ..!

Satyam News

22 న సిద్దిపేట జిల్లా నర్మేట లో ముఖ్యమంత్రి పర్యటన

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

Leave a Comment