ఆధ్యాత్మికంహోమ్

శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా  శివలింగ ప్రతిష్ట.

#ShantiNagar

అలంపూర్ నియోజకవర్గ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో గల శివాలయంలో శివలింగ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన పురోహితులు భాస్కరాచారి ఆధ్వర్యంలో సహా పురోహితులు పత్తికొండ వాస్తవ్యులు శంకర శర్మ,  జయదేవ్ ప్రతిష్టాపనపూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణపతి పూజ పుణ్యాహ వాచనం, కంకణ ధారణ ,పంచగవ్యమేళనం, నాంది ,నవగ్రహారాధన, వాస్తు ఆరాధన, ప్రధాన కలశ స్థాపన, కాశీ విశ్వేశ్వర స్వామికి విశేష ద్రవ్యములతో అభిషేకం నవగ్రహ వాస్తు హోమాలు, ప్రధాన కాశీ విశ్వేశ్వర రుద్ర హోమం, ఘర్తన్యాసం, యంత్రస్థాపన ,విగ్రహ ప్రతిష్ట పూర్ణాహుతి ఉద్వాసన,  ప్రాణప్రతిష్ట ,మహాబలి విధానం జ్వాలా దర్శనములు, మహా మంగళహారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమం నిర్వాహణ కర్తగా ఆలయ  సేవకుడు సావిత్రి ,పకీరప్ప దంపతులు, వారి కుమార్తెలు ఈ మహోత్సవం లో  పాల్గొన్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కోడి వెంకటేశ్వర్లు, గో ప్రచార సేవా సమితి గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు రామచంద్రుడు, కృష్ణమాచారి దంపతులు, బిజెపి సభ్యులు మోహన్ శివకుమార్, రాజశేఖర్, పల్లె ఆంజనేయస్వామి సేవకుడు నాగరాజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

ముచ్చ‌ట‌గా మూడోసారి జొన్న‌గుడ్డి లో కార్డ‌న్ సెర్చ్‌

Satyam News

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో…

Satyam News

గూగుల్‌ డేటా సెంటర్‌తో  2 లక్షల ఉద్యోగాలు… ఇదీ అసలు లెక్క!

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Satyam News

Leave a Comment