25.2 C
Hyderabad
September 10, 2026
గుంటూరుహోమ్

APCRDA ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ‌ విధులపై శిక్షణ `

#Amaravati

ప్రజారాజధాని అమరావతి గ్రామాలలోని 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారికి OHS(ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ)/ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో APCRDA ఆధ్వర్యంలో అమరావతిలోని SRM యూనివర్సిటీ సహకారంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. శిక్షణలో భాగంగా ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలవరకు 45 రోజులపాటు తరగతులు నిర్వహించబడతాయి. ఈ శిక్షణకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో డిప్లొమా/బీటెక్ పూర్తి చేసిన రాజధాని అమరావతి ప్రాంత యువత అర్హులు.

ఈ శిక్షణ ద్వారా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని OHS(ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ)/ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ అవగాహన సైతం ఈ శిక్షణ ఇవ్వడం, శిక్షణ అనంతరం..అభ్యర్థి పెర్ఫార్మన్స్, అనుభవం ఆధారంగా రాజధాని అమరావతిలోని పలు నిర్మాణ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ శిక్షణకు హాజరయ్యే వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించబడుతుంది. ఈ యొక్క ఉచిత శిక్షణలో చేరే ఆసక్తి కలవారు మీ గ్రామంలోని CRDA ఫెసిలిటేటర్‌‌ను సంప్రదించగలరు.

Related posts

విజయవాడ లాకప్ డెత్ పై హక్కుల సంఘం ఆగ్రహం

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

అఖండ 2 వెయ్యికోట్ల గ్రాస్: పెరిగిపోతున్న పందాలు

Satyam News

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

Satyam News

జాన్వీ కపూర్ కొత్త సినిమా పరం సుందరి ఈ శుక్రవారం విడుదల

Satyam News

ఉపాధి హామీ చట్టం మార్పుపై కాంగ్రెస్ నిరసన

Satyam News

Leave a Comment