ఆధ్యాత్మికంహోమ్

కన్నుల పండుగగా శ్రీనివాసుని కళ్యాణం

#SrinivasaKalyanam

ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.

దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణమండపం లో జరిగిన కార్యక్రమంలో కళ్యాణం చేయించిన దాతలు మల్దకల్ నాయక కృష్ణ దంపతులు తాటికుంట వాస్తవ్యులు వీరం కుమార్ దంపతులు తాటికుంట పళ్ళ అయ్యప్ప శెట్టి దంపతులు కళ్యాణం జరిపించగా వేదమంత్రాలతో ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

అనంతరం ఆలయ చైర్మన్ కళ్యాణం జరిపించిన వారికి శేష వస్త్రంతో సన్మానించి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిగింది.

Related posts

హంద్రీ నీవా నీటికి జలహారతి

Satyam News

రోడ్లు సూపర్ – అమరావతి అదుర్స్‌..!

Satyam News

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

Satyam News

జగన్‌కి అందని ఢిల్లీ పల్స్‌…. మోదీ దూకుడుతో మైండ్‌ బ్లాంక్‌….!!

Satyam News

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

Satyam News

ఫ్రాడ్ కేసులో చిక్కిన బాలివుడ్ నటులు

Satyam News

Leave a Comment