34.9 C
Hyderabad
September 16, 2026
ప్రత్యేకంహోమ్

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

#CBN

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ జారీ చేసింది.

సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మొత్తం 438 (సివిల్ 253 (M/W), ఏఆర్ 116(M/W), ఎస్పీఎఫ్ 9(M) , కమ్యూనికేషన్స్ 50 (M/W), పీటీఓ 10(M) ఉన్నాయి.

అదే విధంగా మొత్తం 1156 మంది కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్, ఫైర్ అండ్ ప్రిజన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్ – మెన్ & వుమెన్) 542, ఏఆర్ కానిస్టేబుల్ 285 (మెన్ & వుమెన్) పోస్టులు ఉన్నాయి. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 150 పురుష, 21 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి.

పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ (M/W) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అదే విధంగా పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌ (PTO)లో 198 డ్రైవర్, 15 మెకానిక్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు — (ఫిజికల్ 10, కెమికల్ 13, బయాలజీ/సెరాలజీ 20) ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రత్యేకంగా ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించనున్నది.

Related posts

హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసులో వైసీపీ కార్యకర్త..అమెరికాలో అరెస్టు.!

Satyam News

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News

అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!!

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

ఢిల్లీ పేలుళ్లు: 8 మంది మృతి

Satyam News

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

Satyam News

Leave a Comment