ఆధ్యాత్మికంహోమ్

ఉప్పలపాడులో 12న 18 దేవతా విగ్రహమూర్తుల ప్రతిష్ట 

#Uppalapadu

18 శక్తి పీఠాలకు చెందిన అమ్మవార్లను భక్తులు ఒకేసారి దర్శించుకునేలా పల్నాడు జిల్లా ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం (శ్రీ శక్తి పీఠం)లో ఈనెల 12వ తేదీన ప్రతిష్టించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి తెలిపారు. మంగళవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ అన్నపూర్ణయ్య మాట్లాడారు.

మన భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైన అష్టాదశ శక్తి పీఠాలున్నాయన్నారు. 18 శక్తిపీఠాలను భక్తులందరూ దర్శించుకోవడం కష్టమన్నారు. అమ్మవారి భక్తుల సౌకర్యార్థం గురువారం ఉదయం గం. 9:21 నిమిషాలకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్ల రాతి విగ్రహాలను ప్రతిష్ట చేస్తున్నామని తెలిపారు. విగ్రహమూర్తులను మహాబలిపురంలో తయారు చేయించామని చెప్పారు.

అమ్మవార్ల విగ్రహ మూర్తుల ప్రతిష్ట మహోత్సవంలో నరసరావుపేట, పరిసర ప్రాంత ప్రజలు హాజరై, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, చంద్ర షాపింగ్ మాల్ నిర్వాహకులు గుంటూరు రాము, హనుమంతరావు పాల్గొన్నారు.

Related posts

ఇజ్రాయెల్ తో మన బంధం పటిష్టమైనది

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News

ఫ్యూచ‌ర్  సిటీ-బందరు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి అనుమ‌తులు

Satyam News

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

Leave a Comment