26.3 C
Hyderabad
September 27, 2026
రంగారెడ్డిహోమ్

విద్యార్థుల భవిష్యత్‌ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

#Vikarabad

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ లో  నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, పరిగి,  తాండూర్ శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి లు హాజరై జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన  ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలతో జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యతోపాటు విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ  పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నిమిత్తం అధిక నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి పాఠశాలలో మరమ్మత్తు పనులను  చేపట్టి త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యాలను కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  పాఠశాలల్లో విద్యార్థులకు పౌర హక్కులు, విధుల పట్ల కూడా విద్యా బోధనలో భాగంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల అభిష్టాల మేరకు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్య పట్ల నైపుణ్యం కలిగి ఉండాలని ఉద్దేశంతో ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ) లను ఏర్పాటు చేసి  శిక్షణలో ఇవ్వడం జరుగుతుందని దీనివల్ల పరిశ్రమంలో పని చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.  మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం వంటిపై ఆసక్తిని పెంచి శారీరక దృఢత్వం కార్యకలాపాలపై శ్రద్ధ వహించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు.

ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు మును ముందు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ పురస్కారాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. పరిగి శాసనసభ్యులు టి. రామ్ మోహన్ రెడ్డి, బి. మనోహర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, అన్ని వర్గాల విద్యార్థులు ఒకే దగ్గర విద్యను అభ్యసించేందుకు వీలుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు.  నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏటీసీల ద్వారా శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదేవిధంగా వీటి వల్ల మహిళలు కూడా ఉపాధి పొందుతారని ఎమ్మెల్యే అన్నారు.

తాండూర్ శాసన సభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాల తలరాత మార్చేది విద్య మాత్రమేనని దీనికి దశాదిశను నిర్దేశించే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు.  విద్యపై ఖర్చు పెట్టడం పెట్టుబడి కాదని అది ఒక సంపదని గుర్తించి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ అధిక నిధులను వెచ్చించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.  ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ జిల్లాను   మెరుగైన స్థానంలో ఉంచే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఫైనాన్స్ కమిషనర్ సభ్యులు రంగ రాజన్, మున్సిపల్ వైస్ ఛైర్మన్  సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

నెల్లూరుకు కేంద్రం భారీ గిఫ్ట్‌…. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్!

Satyam News

తాగి టూ వీలర్ నడిపితేనే తప్పు… మరి విమానం నడిపితే?

Satyam News

భార్యపై భర్త అమానుష దాడి

Satyam News

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

Satyam News

Leave a Comment