కృష్ణహోమ్

విజయ సాయిరెడ్డి పార్టీ పెట్టడం లేదు!

#Vijayasaireddy

ఎంతో ఆర్భాటంగా తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆడిటర్ విజయసాయి రెడ్డి తోకముడిచారు. విజయ సాయి రెడ్డి పార్టీ పెట్టడం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముందుగా ఆయన దసరాకు తన పార్టీ పేరును వెల్లడిస్తానని చెప్పారు.

అయితే కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయిరెడ్డి సడెన్ బ్రేకులు వేశారు.  వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్సకు వెళ్లడాన్ని కారణంగా చెబుతున్నారు. ఇలాంటి సిల్లీ కారణంతో ఎవరైనా పార్టీ ప్రకటన ఆపుతారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పార్టీ తేదీని ప్రకటిస్తానని చెప్పడం వెనుక చాలా పెద్ద కథ ఉందని సులువుగానే అంచనా వేయవచ్చు. అసలు విజయ సాయి రెడ్డి పార్టీ పెట్టగలుగుతాడా అనే ప్రశ్న ముందే ఉదయించినప్పటికీ ఆయన ప్రకటనలు చూసి కొందరు నిజమని నమ్మారు.

అయితే జగన్ నుంచి వచ్చిన రాయబారాలు, తిరిగి తాడేపల్లి ప్యాలెస్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ దక్కడం వల్లే ఈ యూ-టర్న్ తీసుకున్నారని అంటున్నారు.  కొత్త పార్టీ హడావుడిని కోల్డ్ స్టోరేజీలో పెట్టి తెరవెనుక సర్దుబాటుకే ప్రాధాన్యం ఇచ్చారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.

Related posts

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

Satyam News

పాకిస్తాన్ చొరబాటుదారుడి కాల్చివేత

Satyam News

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News

కష్టకాలంలో కూలీలను ఆదుకున్న పథకాన్ని నిలిపివేసిన మోదీ

Satyam News

జగన్‌కు బిగ్‌షాక్…10,700 ఎకరాల బ్రాహ్మణి స్టీల్స్ భూములు సీజ్!

Satyam News

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

Leave a Comment