తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అమరావతి నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, బోర్డు మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు. అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేశారు.
పనులు ఇవీ:
భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరణ
శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి శంకుస్థాపన
టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్ అభివృద్ధి, 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన
అలిపిరి వద్ద రూ.1,332 కోట్లతో భక్తుల కోసం వసతి సముదాయాల నిర్మాణం
నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు.. రోజుకు 15 వేల మంది భక్తులకు వసతి కల్పన
రూ.160 కోట్లతో అన్నప్రసాద కేంద్రం…ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా రూపకల్పన.
రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం
పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు
రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నిర్మాణం
రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం
తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు
తిరుమలపై రద్దీని తగ్గించేలా దిగువ తిరుపతిలో వసతి సౌకర్యాల విస్తరణ
భక్తుల కోసం పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం ఏర్పాటు
టౌన్‌షిప్‌లో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థ
టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం దిశగా నివాస లేఅవుట్ అభివృద్ధి
418 ఎకరాల్లో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు
టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్‌లో మౌలిక వసతులకు రూ.230 కోట్ల వ్యయం
ఉద్యోగుల లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు
తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి 3 మాస్టర్ ప్లాన్ రహదారులు
