గుంటూరుహోమ్

ఏపీలో 11 మంది ఐఏఎస్‌లకు కొత్త బాధ్యతలు

#secretariat

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్‌ అధికారులకు కొత్త పోస్టింగులు కల్పించడంతోపాటు, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీఓ ఆర్టీ నంబరు 1985ను విడుదల చేసింది.

మొత్తం 11 మంది అధికారులకు వివిధ శాఖల్లో బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ప్రత్యేక విధుల అధికారిగా సౌరభ్‌ గౌర్‌ను నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా డి. మురళీధర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా మంజుల బాలాజీ దిగంబర్‌ను నియమించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమ్రపాలి కటాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెకు సంబంధిత శాఖల బాధ్యతలు అప్పగించింది.

యువజన సేవల డైరెక్టర్‌గా కె. నీలకంఠరెడ్డిని నియమించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీగా బి. అనిల్‌ కుమార్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్‌. తేజ్‌భరత్‌ను నియమించింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డిప్యూటీ సెక్రటరీగా గెడెల శ్రీనుకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎం. వరప్రసాద్‌ను నియమించింది. ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్‌ బన్సల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు కేటాయించింది.

Related posts

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

Satyam News

Leave a Comment