హైదరాబాద్హోమ్

తప్పుడు వార్తలపై వెలుగు, వీ6 క్షమాపణ చెప్పాలి

#VasudevaReddy

కొండపోచమ్మ సాగర్‌ నీటిని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిస్తున్నారనే కథనం ద్వారా ప్రజల దృష్టిని ఇతర సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, వెలుగు, వీ6 చేస్తున్న ఈ ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు.

కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు ఉద్దేశం, దాని ద్వారా అందుతున్న సాగునీటి ప్రయోజనాలను విస్మరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వాసుదేవరెడ్డి అన్నారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ద్వారా ఐదు జిల్లాలు, పది నియోజకవర్గాల్లో 2,85,280 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారని తెలిపారు. మెదక్‌, గజ్వేల్‌, దుబ్బాక, ఆలేరు, మల్కాజిగిరి ప్రాంతాల్లో సుమారు 170 కిలోమీటర్ల పరిధిలో 750 చెరువులను నింపేలా ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు వివరించారు. ఇంతటి విస్తృత ప్రయోజనాలున్న ప్రాజెక్టును కేవలం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటిని మళ్లించే వ్యవస్థగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వెలుగు దినపత్రిక, వీ6 న్యూస్‌ ఛానల్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడితే అదే వార్తగా ప్రచురిస్తున్నారన్న భావన కలుగుతోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పత్రికగా నమస్తే తెలంగాణపై విమర్శలు చేసే వారు, వెలుగు, వీ6 వ్యవహారశైలిని కూడా పరిశీలించాలని సూచించారు. ప్రజల కోణంలో వార్తలు రాయాల్సిన మీడియా సంస్థలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని మీడియా సంపాదకులకు సూచించారు.

రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై వెలుగు, వీ6 ఎందుకు కథనాలు ప్రచురించడం లేదని ఆయన ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్‌ సరఫరా సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వస్తున్న రైతుల సమస్యలకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని మెడికవర్‌ ఆసుపత్రుల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయంటూ బాధితుల బంధువులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొంటూ, ఈ పరిణామాలపై వార్తలు ఎందుకు ప్రచురించడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాయడం పత్రికా స్వేచ్ఛకు అర్థం కాదని వ్యాఖ్యానించారు.

కొండపోచమ్మ సాగర్‌పై ప్రచురించిన కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవడంతోపాటు, అదే ప్రధాన శీర్షికతో ఆ కథనం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని స్పష్టీకరణ ప్రచురించాలని వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిపక్షంలో వెలుగు దినపత్రిక, వీ6 న్యూస్‌ ఛానల్‌పై ఆధారాలతో సహా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అసత్య ప్రచారాలపై తమ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Related posts

నన్ను తీవ్రంగా అవమానిస్తున్నారు: కొండా సురేఖ

Satyam News

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

ఫారం 6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన

Satyam News

Satyam News

Leave a Comment