కృష్ణహోమ్

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం

#SBI

అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తమవంతు సాయం అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం  చెక్కును అందజేశారు. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళం అందించిన ఎస్‌బీఐ మేనేజ్మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, అమరావతి సర్కిల్ జీఎం కుందన్ జ్యోతి, అమరావతి సర్కిల్ ఏజీఎం షేక్ షమీన్ భాను ఉన్నారు.

Related posts

లాయర్‌ను కిడ్నాప్ చేసి..ఆస్తులు రాయించుకుని..

Satyam News

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News

ఒకవైపు ఎండలు ఇంకో వైపు వానలు

Satyam News

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News

అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించాలి

Satyam News

కార్తీకమాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Satyam News

Leave a Comment