గుంటూరుహోమ్

లాయర్‌ను కిడ్నాప్ చేసి..ఆస్తులు రాయించుకుని..

#Macharla

వైసీపీ హయాంలో పల్నాడు జిల్లాలో అరాచకాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు కర్నాటి వీరభద్రరావు ఉదంతమే నిదర్శనం. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులనే పావులుగా వాడుకుని, ఏకంగా ఓ న్యాయవాదినే కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకున్న వైనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 22 నెలలుగా సాగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు వీరభద్రరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ దారుణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి గురజాల డీఎస్పీ పల్లంరాజే. న్యాయవాది హరిబాబు వద్ద తీసుకున్న రూ.కోటి అప్పును ఎగ్గొట్టేందుకు వీరభద్రరావు గ్యాంగ్‌ భారీ స్కెచ్ వేసింది. పల్నాడులో పిన్నెల్లి కోటరీకి తిరుగులేదన్న గర్వంతో, సాక్షాత్తూ డీఎస్పీ, ఎస్సై, కానిస్టేబుళ్ల సహాయంతో విజయవాడలో ఉన్న న్యాయవాదిని కిడ్నాప్ చేయించారు.

కిడ్నాప్ చేసిన హరిబాబును పిడుగురాళ్ల స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి బెదిరింపులకు గురిచేశారు. చంపేస్తామంటూ హెచ్చరించి బలవంతంగా 2 ఎకరాల పొలం, ఒక ట్రిపుల్‌ బెడ్రూం ఫ్లాట్‌ను నిందితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలు, బంధువుల నుంచి మరో రూ.10 లక్షలు వసూలు చేసి దోపిడీ పర్వాన్ని కొనసాగించారు.

న్యాయస్థానం ఆదేశించినా 22 నెలల పాటు పోలీసులు ఈ కేసును తొక్కిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధితుడు హరిబాబు పట్టువదలని విక్రమార్కుడిలా కోర్టుధిక్కారం కింద మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతోనే ఈ అరెస్ట్ సాధ్యమైంది. త్వరలోనే నాటి డీఎస్పీ పల్లంరాజుతో పాటు మిగిలిన పోలీస్ అధికారులను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది.

Related posts

ముచ్చింతల్‌లో సమతా మూర్తిని దర్శించుకున్న సుమ

Satyam News

అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు

Satyam News

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

నిన్న కమ్మ ద్వేషం… నేడు.. కాపులతో పాలిటిక్స్..

Satyam News

వైభవంగా లక్ష్మీనరసింహ కళ్యాణం

Satyam News

శ్రీ పద్మావతి అమ్మవారి  కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

Satyam News

Leave a Comment