హైదరాబాద్హోమ్

వచ్చే ఏడాదిలోగా కేసీఆర్ మళ్లీ సీఎం

#ktr

వచ్చే ఏడాదిలోగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచి, అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించిందని, ఆ పార్టీ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని విమర్శించారు. భూములు అమ్ముకునే బ్రోకర్‌గా రేవంత్ రెడ్డిని అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే ఆ భూములను అమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు సామాన్యులు చెరువు శిఖం భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడుతున్నారని, మరోవైపు ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి వారికి సంబంధించిన నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హైడ్రా వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందని నిలదీశారు. హైడ్రా చర్యలతో హైదరాబాద్‌లో భూముల విలువలు పడిపోయాయని పేర్కొన్నారు.

హిల్ట్ పాలసీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెరతీశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విధానం ద్వారా లావాదేవీలు జరిపి సుమారు 10 వేల ఎకరాల భూములను విక్రయించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి హిల్ట్ పాలసీ కింద భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూములు, వక్ఫ్ భూములను కూడా ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు.

శేరిలింగంపల్లి రాజకీయాలను ప్రస్తావిస్తూ, గత ఎన్నికల్లో కేసీఆర్ ముఖం చూసే ప్రజలు అరికెపూడి గాంధీకి ఓట్లు వేశారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

సంఘ్ శ‌తాబ్ది ఉత్స‌వ వేళ‌ గణవేష్ అభియాన్

Satyam News

హాలీవుడ్ లో సందడి చేసిన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి

Satyam News

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

Satyam News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

ఒంటిమిట్టలో తెలుగుదేశం ఘన విజయం

Satyam News

Leave a Comment