ముఖ్యంశాలుహోమ్

మల్లెతీగ కథలు కవితల పోటీ–2026కి ఆహ్వానం

#Malleteega

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 12, 13 తేదీల్లో విజయవాడలో రెండు రోజులపాటు ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు–2026’ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తెలుగు కథలు, కవితల పోటీ–2026ను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. సమకాలీన సామాజిక సమస్యలు, ప్రశ్నార్థకంగా మారుతున్న మానవతా విలువలు, తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే వైవిధ్యభరితమైన కథలు, కవితలను ఈ పోటీకి ఆహ్వానిస్తోంది. తెలుగు కవులు, రచయితలందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

రచనలకు నిబంధనలు

కథలు 3 లేదా 4 A4 పేజీలకు మించకూడదు.

కవితలు 40 పంక్తులకు మించకూడదు.

రచనలు డీటీపీ లేదా యూనికోడ్ ఫాంట్‌లో PDF రూపంలో పంపాలి.

చేతిరాత ప్రతులను స్వీకరించరు.

నగదు బహుమతులు

కథల విభాగం

8 ఉత్తమ కథలకు ఒక్కొక్కటి రూ.5,000.

10 కన్సొలేషన్ కథలకు ఒక్కొక్కటి రూ.1,000.

కవితల విభాగం

8 ఉత్తమ కవితలకు ఒక్కొక్కటి రూ.2,500.

10 కన్సొలేషన్ కవితలకు ఒక్కొక్కటి రూ.500.

రచనలు పంపడానికి చివరి తేదీ: నవంబరు 23, 2026.

రచనలను malleteega.sss@gmail.com ఈ-మెయిల్‌కు పంపాలి.

పోటీలో ఎంపికైన కథలు, కవితలతో ప్రత్యేక సంచికను ముద్రించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. బహుమతులు పొందిన రచయితలు, కవులకు డిసెంబరు 12, 13 తేదీల్లో విజయవాడలో జరిగే ఉత్సవాల్లో నగదు పురస్కారాలతో పాటు ఘనంగా సత్కారం చేయనున్నారు.

సంప్రదించాల్సిన నంబర్: 92464 15150

కలిమిశ్రీ

మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ

Related posts

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News

అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలౌతుందా?

Satyam News

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

Satyam News

నీలోఫర్ నర్సింగ్ ఆఫీసర్లకు గణతంత్ర గౌరవం

Satyam News

Leave a Comment