మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో మెడికల్ షాపులపై TG SAFE దాడులు

#Wanaparthy

వనపర్తి పట్టణంలో ఆస్పత్రుల అనుబంధ మెడికల్ షాపులపై TG SAFE – డ్రగ్స్ వింగ్ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేశారు. హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ అంజుమ్ అబిద ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటు, షెడ్యూల్ H1 మందుల రిజిస్టర్లు, ఎక్స్‌పైరీ మందుల నిల్వలు, కొనుగోలు-విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు D. సరిత (మహబూబ్ నగర్), G. ప్రసాద్ (రంగారెడ్డి), వనపర్తి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రష్మి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యమని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

ఫేక్ న్యూస్ కు ఘాటు సమాధానం ఇవ్వండి

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

Satyam News

చెవి కమ్మల కోసం వృద్ధురాలి హత్య

Satyam News

బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

Leave a Comment