సంపాదకీయంహోమ్

డీలిమిటేషన్..చంద్రబాబు పక్కా స్కెచ్!

#ChandrababuNaidu

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి ఆశలు పెట్టుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని టీడీపీని దెబ్బతీశారు. ఇప్పుడు సరిగ్గా అదే ఫార్ములాతో, రాబోయే పునర్విభజన ప్రక్రియను తమ కూటమికి అనుకూలంగా మలచుకుని వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలని చంద్రబాబు స్కెచ్‌ వేస్తున్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు పెరిగే అవకాశం ఉంది. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరిగేలా కేంద్రం తెస్తున్న సవరణలకు చంద్రబాబు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీ పెద్దల దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి, ఈ డీలిమిటేషన్ ప్రక్రియను 2029 ఎన్నికల నాటికి కచ్చితంగా పూర్తి చేయించేలా బాబు పావులు కదుపుతున్నారు.

అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చేర్చడం ద్వారా పక్కనున్న ఆరు స్థానాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసిన BJP ఫార్ములా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశమైంది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలను వ్యూహాత్మకంగా విభజించడం ద్వారా, ఆ పార్టీ ప్రభావాన్ని పరిమితం చేయాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా  అనుకూలంగా మార్చుకోవాలనేది బాబు అసలు స్కెచ్.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో ముడిపెట్టి తెస్తున్న ఈ బిల్లుకు NDAలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ సంపూర్ణ మద్దతు అందిస్తోంది. సీట్ల పెంపుతో పాటు పునర్విభజన జరిగితే పార్టీలోని సీనియర్లు, యువనేతలకు న్యాయం చేయడంతో పాటు, రాబోయే రెండు దశాబ్దాల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎదురులేకుండా చేసుకోవచ్చని చంద్రబాబు గట్టి నమ్మకంతో అడుగులు వేస్తున్నారు.

Related posts

తెలంగాణ ను వదలని పే టీ ఏం వైసీపీ బ్యాచ్

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

జగన్ పీఆర్వోకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Satyam News

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు

Satyam News

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

Leave a Comment