ప్రపంచంహోమ్

ఇరాన్ హెచ్చరిక: స్కూల్లో చిన్నారులను చంపిన మిమ్మల్ని వదలం

#USForces

ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఓ ప్రాథమిక పాఠశాలపై టోమాహాక్ క్షిపణులతో దాడి చేసి 168 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ ఇద్దరు అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను ఇరాన్ విడుదల చేసింది. ‘మిమ్మల్ని వదిలిపెట్టం’ అంటూ హెచ్చరిక జారీ చేసింది.

దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం నవంబర్ 14న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ హెచ్చరికను జారీ చేసింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ యుద్ధనౌక కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ లీ ఆర్. టేట్, ఆ నౌక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ జెఫ్రీ ఈ. యార్క్‌లను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలను పోస్టు చేసింది. ‘మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం’ అంటూ హెచ్చరించింది.

మార్చి 28న కూడా ఇరాన్ ఇదే తరహాలో ఈ ఇద్దరు అధికారులపై ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ప్రాథమిక పాఠశాలపై అమెరికా బలగాలు టోమాహాక్ క్షిపణులతో దాడి చేయగా 168 మంది చిన్నారులు మరణించారని, ఆ దాడులకు ఈ అధికారులే ఆదేశాలిచ్చారని ఇరాన్ ఆరోపించింది. ‘ఈ ఇద్దరు నేరస్థులను గుర్తుంచుకోండి. వీళ్లకు సొంతంగా పిల్లలు లేరా?’ అంటూ అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారితమైన వివరాలు అందుబాటులో లేవు.

ఇరాన్‌పై చేపట్టిన సైనిక కార్యకలాపాలతో కూడిన 357 రోజుల సుదీర్ఘ విధులను ముగించుకుని యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ శుక్రవారం శాన్ డియాగోకు తిరిగి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నౌకాదళ అధికారుల వ్యక్తిగత వివరాలు, ఫొటోలను బహిరంగంగా ప్రచురిస్తూ ఇరాన్ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేయడం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉన్నతాధికారులను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ 12న రేడియో వ్యాఖ్యాత హ్యూ హెవిట్‌తో జరిగిన ఇంటర్వ్యూలో అమెరికా ఉన్నతాధికారిని ఇరాన్ హత్య చేస్తే అమెరికా ఎలా స్పందిస్తుందని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘అలా చేస్తే వారు ఎక్కువ కాలం ఉనికిలో ఉండరు’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌కు కూడా ఇరాన్‌కు సంబంధించినవిగా అనుమానిస్తున్న వర్గాల నుంచి వరుసగా హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ సూచన మేరకు వాషింగ్టన్ సమీపంలోని తన నివాసం నుంచి సైనిక స్థావరానికి ఆయన నివాసాన్ని మార్చుకున్నారు. శుక్రవారం సీబీఎన్‌సీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందికి కూడా నిరంతరం హత్య బెదిరింపులు వస్తున్నాయని, అలాంటప్పుడు తాను ఎందుకు భయపడాలని బెసెంట్ వ్యాఖ్యానించారు.

Related posts

జగన్ చెంప చెళ్ళుమనిపించిన కేంద్రం

Satyam News

చరిత్రలో అతి పెద్ద చమురు ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్

Satyam News

ముద్రగడ ఔట్‌… రంగా కూతురితో వైసీపీ రాజకీయం..?

Satyam News

బీసీసీఐకి భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం

Satyam News

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

Satyam News

Leave a Comment