హైదరాబాద్హోమ్

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు అరోబిందో రూ.కోటి విరాళం

#Arabindo

మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.కోటి విరాళం అందించింది. ఈ మేరకు బుధవారం ఫౌండేషన్‌ ప్రతినిధులు డీజీపీ సి.వి. ఆనంద్‌కు కోటి రూపాయల చెక్కును అందజేశారు.

అరోబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎస్‌. సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఐ.ఎస్‌.ఆర్‌. రావు ఈ చెక్కును డీజీపీకి అందజేశారు.

ఈ విరాళం అందించడంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు.

ఈ నిధులతో పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

ఈ కార్యక్రమంలో డీజీపీ సి.వి. ఆనంద్‌, మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్‌ సబర్వాల్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ పోలీసులతో కలిసి పని చేస్తారా?

Satyam News

కొండవీటివాగు పై రెండు లైన్ల వంతెన

Satyam News

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

Satyam News

పవన్ క్రియేటీవ్ వర్క్స్ మరో ప్రాజెక్టులో బిజీ

Satyam News

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

Leave a Comment