కృష్ణహోమ్

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల సందడి: వేకువజాము నుంచే రద్దీ

#Bhavani

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ భవానీ మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం రెండో రోజు శనివారం వైభవంగా కొనసాగింది.

వందలాది మంది భక్తులు తరలివచ్చి మహామండపం ఆరో అంతస్తులో కొలువుదీరిన శ్రీ భవానీ అమ్మవారి సన్నిధిలో గురుభవానీల సమక్షంలో శాస్త్రోక్తంగా దీక్షా మాలధారణ చేశారు. శనివారం సెలవు దినం కావడంతో పాటు దీక్షల స్వీకరణ కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఘాట్ రోడ్డు, లిఫ్ట్ మార్గాల ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దర్శనం టికెట్ కౌంటర్లు, ప్రసాదం టికెట్ కౌంటర్లు, చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్‌లను పరిశీలించారు.

ఈ సందర్భంగా టికెట్ కౌంటర్లు, స్కానింగ్ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. టికెట్ల జారీ, స్కానింగ్ ప్రక్రియలో అప్రమత్తంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భక్తులకు సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.

Related posts

శ్రీశైలం లో కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

Satyam News

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

జూరాల, కేఎల్ఐ పరిధిలోని పంపులు వెంటనే ప్రారంభించాలి

Satyam News

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News

బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు సహకరించండి

Satyam News

Leave a Comment