విజయనగరంహోమ్

బంగారు గొలుసు దోచుకున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

#VijayanagaramPolice

విజయనగరం జిల్లా జామి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలను అపహరించిన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధురాలిని బలవంతంగా తోసివేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఇద్దరు నిందితులను సిసిఎస్, జామి పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణ మూర్తి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ ఏడాది నవంబరు 16వ తేదీన కుమరాంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న పొటిపిరెడ్డి రమణమ్మ అనే మహిళ, భీమసింగి–విజయనగరం బీటీ రోడ్డులోని ఎస్.ఆర్.కె. సెల్ పాయింట్ ఎదురుగా మధ్యాహ్నం సుమారు 2.55 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమెను బలంగా తోసివేయడంతో రోడ్డుపై పడిపోయారు. అనంతరం ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును లాక్కొని, సమీపంలో ద్విచక్ర వాహనంపై వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుడు పొటిపిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జామి పోలీస్ స్టేషన్‌లో Cr.No.74/2026 U/S 307 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని డీఎస్పీ మూర్తి తెలిపారు.

పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించి, నేరంలో పాల్గొన్న (ఎ-1) గుర్ల మండలం, గరికివలసకు చెందిన పొట్నూరు హరికృష్ణ (29) (ఎ-2) సంగంరెడ్డి శివగణేష్ (30) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశామన్నారు. ఈ నేరంలో మరో వ్యక్తి (ఎ-3) అవల అప్పలనాయుడు పరారీలో ఉన్నట్లు, అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు

బాధితురాలి నుంచి అపహరించిన సుమారు 4 తులాల బంగారు గొలుసు (రెండు ముక్కలుగా).

నేరానికి ఉపయోగించిన హోండా ఎక్స్‌బ్లేడ్ ద్విచక్ర వాహనం (AP 35 AR 4477).

నిందితుల వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు.

మరో కేసుకు సంబంధించిన సుమారు 2 తులాల బంగారు గొలుసు.

విచారణలో నిందితులు విజయనగరం టూ టౌన్, జామి పోలీసు స్టేషన్ పరిధిలోనూ, విశాఖ సిటీ పెందుర్తిలో ఒకటి చొప్పున, ఆనందపురం లో రెండు స్నాచింగ్స్ కు పాల్పడినట్లుగా అంగీకరించారన్నారు. విజయనగరం టూ టౌన్ కేసుకు సంబంధించిన బంగారు గొలుసును (2 తులాల) కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన ఇతర నేరాల్లో వారి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో చురుకుగా వ్యవహరించిన సీసీఎస్ సిఐ డిడి నాయుడు, ఎస్.కోట రూరల్ సిఐ హిమగిరి, జామి ఎస్ఐ వై.వీర జనార్ధన్, సీసీఎస్ సిబ్బంది, జామి సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో విలువైన బంగారు ఆభరణాలను ధరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి విజ్ఞప్తి చేశారు.

Related posts

ఒంగోలులో ‘స్నేహ’ సేవా కార్యక్రమం

Satyam News

టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ కూడా వైదొలగుతుందా?

Satyam News

ఉపాధి అవకాశాలు కల్పించడమే రేవంత్ రెడ్డి ధ్యేయం

Satyam News

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

లిక్కర్ స్కామ్‌లో సంచలనం..నెక్ట్స్‌ బిగ్‌బాస్.?

Satyam News

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News

Leave a Comment