జాతీయంహోమ్

దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార కార్యక్రమం

#degitalLifeCertificate

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 2,000 నగరాలు/జిల్లాల్లో దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార కార్యక్రమాన్ని గురువారంనాడు నిర్వహించారు. అన్ని భాగస్వామ్య పక్షాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ‘సంపూర్ణ ప్రభుత్వ విధానం’ (Whole of Government Approach)కు ఈ ప్రచార కార్యక్రమం నిదర్శనం. ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణతో పెన్షనర్లకు సులభతరమైన, అవాంతరాలు లేని సేవలు అందుతాయి.

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల జీవన సౌలభ్యాన్ని (Ease of Living) మెరుగుపరిచే లక్ష్యంతో, పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC), అంటే జీవన్ ప్రమాణ్ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. 2014లో బయోమెట్రిక్ పరికరాల ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ ప్రక్రియ ప్రారంభమైంది.

అనంతరం, ఆధార్ డేటాబేస్ ఆధారంగా ఫేస్ ఆథెంటికేషన్ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ శాఖ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)లతో కలిసి పనిచేసింది. ఈ సాంకేతికత ద్వారా ఏ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ నుంచైనా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించడం సాధ్యమవుతోంది.

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కోసం ఫేస్ ఆథెంటికేషన్ సాంకేతికత వినియోగంపై కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, పెన్షన్ పంపిణీ సంస్థల్లో అవగాహన కల్పించేందుకు DoPPW వివిధ భాగస్వామ్య సంస్థల సహకారంతో ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2022 నుంచి ఇప్పటివరకు ఇలాంటి నాలుగు ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది.

దేశవ్యాప్త DLC ప్రచార కార్యక్రమం–5ను DoPPW 2026 నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 2,000 జిల్లాలు/నగరాల్లో వివిధ భాగస్వామ్య సంస్థల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), పెన్షన్ పంపిణీ బ్యాంకులు, పెన్షనర్ల సంక్షేమ సంఘాలు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. UIDAI, MeitY సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి.

గరిష్ఠ సంఖ్యలో పెన్షనర్లు ఈ సేవలను వినియోగించుకునేలా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, నమోదిత పెన్షనర్ల సంక్షేమ సంఘాలకు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా శిబిరాలకు వచ్చే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను రూపొందించి అందిస్తున్నారు. భవిష్యత్తులో పెన్షనర్లు స్వయంగా DLCలను రూపొందించుకునేలా ఈ ప్రక్రియపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. అవసరమైన పెన్షనర్లకు వారి ఇంటి వద్దకే సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగ పెన్షనర్లకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

ఈ శిబిరాల్లో ఆధార్ వివరాల నవీకరణ, ఆరోగ్య శిబిరాలు, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు వంటి పలు ఇతర సేవలను కూడా అందిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, 2026 నవంబర్ 26న సీనియర్ డైరెక్టర్ (ఐటీ) అనిల్ బన్సాల్ హైదరాబాద్‌లోని SBI లోకల్ హెడ్ ఆఫీస్ (LHO)లో SBI నిర్వహించిన DLC శిబిరాన్ని, హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)లో IPPB నిర్వహించిన శిబిరాన్ని సందర్శించారు.

డిజిటల్ సేవలను వినియోగించుకుంటున్న పెన్షనర్లతో ఆయన మాట్లాడారు. DoPPW అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెన్షనర్ల సంఘం, IPPB ప్రతినిధులతో కలిసి ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను రూపొందించడంలో పెన్షనర్లకు సహకరించారు.

అలాగే, DoPPW, IPPB అధికారులు అత్యంత వృద్ధులు, దివ్యాంగ పెన్షనర్ల ఇళ్లను సందర్శించి, వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను రూపొందించి అందించడంతో పాటు, ఈ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించి, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశారు.

Related posts

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

అమెరికా భారత్ మధ్య మళ్లీ వాణిజ్య చర్చలు

Satyam News

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

ఇంద్రకీలాద్రిపై నవంబర్ 24న కార్తీక దీపోత్సవం

Satyam News

కిషన్ రావుకు ఉద్వాసన

Satyam News

Leave a Comment