26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

#CMMeeting

అమరావతిలో రాష్ట్రంలోని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఉప సంఘ సభ్యులైన మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు.

ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం లోతైన చర్చలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పరిపాలనా వ్యవస్థలో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

గతంలో జరిగిన జిల్లా పునర్ వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో 7 మంది మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సమగ్ర పరిశీలన చేపట్టింది.

పలుమార్లు సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాలు, ప్రజా సంఘాల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూడా ఈ సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగింది.

Related posts

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

Satyam News

నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Satyam News

ఇరాన్ పై మళ్లీ దాడి చేసిన అమెరికా

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

అమెరికా లో అరకు కాఫీ… న్యూయార్క్ లో ఆనంద్ మహేంద్ర స్టోర్

Satyam News

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News

Leave a Comment