ఆదిలాబాద్హోమ్

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భైరవ నామ స్మరణతో మారుమోగింది.

ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులంతా భజన కీర్తనలతో పునీతులయ్యారు.

అనంతరం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలికోట రమాదేవి-సంతోష్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పారుపెళ్లి కాలభైరవ ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

Related posts

బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

Satyam News

వైసీపీ ‘అనుబంధ’ పోలీసు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Satyam News

కేరళ సీఎం అభ్యర్ధిపై ఇంకా అనిశ్చితే…

Satyam News

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి

Satyam News

మీడియాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

Satyam News

రౌడీయిజం చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా?

Satyam News

Leave a Comment