ప్రత్యేకంహోమ్

జోగి రమేష్… బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయే ప్రయత్నం

నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత జోగి రమేష్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి జోగి రమేష్ సుమారు రెండు గంటల పాటు తన ఇంటి తలుపులు తీయకుండా, పారిపోవడానికి విఫలయత్నం చేసినట్లు సమాచారం.

నకిలీ మద్యం కేసులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని జోగి రమేష్ ప్లాన్ వేసి, అడ్డంగా దొరికిపోయారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్, వెంటనే ఇంటి తలుపులు తెరవలేదు. అరెస్ట్ తప్పించుకోవాలని లేదా తమకు ఈ వ్యవహారం చుట్టుకుంటుందని భావించి తాడేపల్లి ప్యాలెస్ (వైసీపీ అగ్రనేతలు) ఆదేశాల మేరకు, జోగి రమేష్ సుమారు రెండు గంటల పాటు తలుపులు తీయకుండా ఇంట్లోనే ఉన్నారు.

ఈ సమయంలో ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పోలీసుల కళ్లుగప్పి పారిపోవడానికి, తన ఇంటి వెనుక వైపు ఉన్న బాత్రూమ్ కిటికీ ద్వారా బయటకు వెళ్లాలని ప్రయత్నించారు. అయితే, ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు, ఇంటి ముందు గేటుతో పాటు వెనుక వైపు కూడా అదనపు బలగాలను మోహరించారు.

జోగి రమేష్ బాత్రూమ్ డోర్ తీయగానే, అక్కడ కాపు కాసిన పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయనకు షాక్ తగిలినట్లు సమాచారం. చేసేది లేక, జోగి రమేష్ లొంగిపోయారు. అనంతరం, ఎక్సైజ్ పోలీసులు, సిట్ అధికారులు ఆయన్ను, ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆరేపల్లి రామును అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించింది.

Related posts

ఇంకా బలంగానే ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదులు

Satyam News

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

విజయనగరం లో ఖాకీ నాకా బందీ…!

Satyam News

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

Leave a Comment