కడపహోమ్

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

#crime

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలను మింగేస్తున్నది. రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని కంచిపాటి వాండ్ల పల్లెలో అక్రమ మట్టి రవాణా కట్టలు తెంచుకుంది.

మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఇంత జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర ప్రదర్శిస్తూ ఉండడం అవినీతికి లంచాల పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఉదయం నుంచి మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే మండలంలోని ప్రజలందరికీ తెలిసినా రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం శోచనీయం. మైనింగ్ అధికారులు కూడా నిద్రమత్తును ప్రదర్శిస్తూ అక్రమ మట్టి వానాదారులతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.

Related posts

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల పూజలు

Satyam News

డ్రగ్స్, మానవ అక్రమ రవాణ నిరోధంలో ఎస్ఎస్ బి సేవలు భేష్

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కార్యాచరణ

Satyam News

పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్

Satyam News

‘కాక్రోచ్’ రాజకీయ పార్టీ ఇప్పుడే కాదు….

Satyam News

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం

Satyam News

Leave a Comment