26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

#Lokesh

మంత్రి నారా లోకేష్‌ బిజిబిజీగా గడుపుతున్నారు. అమెరికా, కెనడా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్..వెంటనే విశాఖలో 8 ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల వరుస పర్యటనలతో తీరిక, విశ్రాంతి లేకుండా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఇతర ప్రాజెక్టుల కోసం ఢిల్లీ పెద్దలు, పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న నారా లోకేష్..పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఐతే లోకేష్ ఢిల్లీ పర్యటన వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో 17.5 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడికి హామీ ఇచ్చారు సత్య నాదెళ్ల. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కాగా, ఆసియాలో మైక్రోసాఫ్ట్‌ తరఫున ఇదే అతిపెద్ద పెట్టుబడి అని సమాచారం.

ఐతే మైక్రోసాఫ్ట్‌ను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు లోకేష్. ఇప్పటికే విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్‌తో కలిసి తమ అతిపెద్ద AI డేటా సెంటర్లలో ఒకదాన్ని నిర్మించడానికి $15 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. పనులు సైతం వేగవంతమయ్యాయి. అంతే కాదు పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ న దేశవ్యాప్తంగా AI మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినందున, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ దిశగానే లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఐటీ శాఖ మంత్రిచర్చలు జరపనున్నారు. ఇటీవల అమెరికా, కెనడా పర్యటనలో ప్రముఖ సంస్థలు, ఆ సంస్థల ఉన్నత ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించిన లోకేష్..ఆ పర్యటన వివరాలను కేంద్ర మంత్రితో పంచుకోనున్నారు. ఏదైనా ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. ఇక, ఇటీవల మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల హామీ ప్రకటనపైనా లోకేష్ కేంద్రమంత్రితో చర్చిస్తారని తెలుస్తోంది. ఏపీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరనున్నారు లోకేష్.

ఇక, ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మళ్లీ విశాఖకు వెళ్లనున్నారు లోకేష్. మంగళవారం విశాఖ పట్నంలో నిర్వహించే GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖలో ఏవియేషన్ విద్యా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మేలు జరగనుంది. రెండు రోజుల క్రితమే విశాఖలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్, ఇంతలోనే నగరానికి వెళ్తున్నారు. విశాఖలో ఇకపై లోకేష్ పర్యటన తరచుగా ఉండనుంది. కొత్త సంస్థల ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థల పురోగతిపై ఆయన వరుస పర్యటనలు నిర్వహించే అవకాశం ఉంది.

Related posts

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

భారత్ తో మాకు విభేదాలు లేవు: అమెరికా స్పష్టీకరణ

Satyam News

Leave a Comment