విజయనగరంహోమ్

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

#CardenAndSearch

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధి గుంకలాం లేఔటులో సోమవారం “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ నిర్వ‌హించారు.డీఎస్పీ గోవింద‌రావు ఆధ్వ‌ర్యంలో దాదాపు ఒక ప్ల‌టూన్ సిబ్బంది ఏక‌కాలంలో గుంకలాం లేఔటులోని ఇండ్లు, బహిరంగ ప్రదేశాలల్లో సోదాలు నిర్వహించారు.

అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావుతో పాటు విజయనగరం రూరల్ సర్కిల్ పోలీసు  సిబ్బంది సుమారు ఇర‌వై మందితో బృందాలుగా ఏర్పడి  సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ – విజయనగరం రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో గుంకలాం లేఔటులోని ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, నాటుసారా, అనుమానిత వ్యక్తులు, ఇతర నిషేధిత వస్తువులు/పదార్దాలే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించామన్నారు.

గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు  ఆధ్వర్యంలో విజయనగరం రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 60 మందితో బృందాలుగా ఏర్పడి గుంకలాం లేఔటులోని ఇండ్లలోను, బహిరంగ ప్రదేశాలల్లో సోదాలు నిర్వహించామన్నారు.

గ్రామంలో అన్ని ఇండ్లలో ఒకేసారి ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసామన్నారు. అదే విధంగా వారి వద్ద లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 10 ద్విచక్ర వాహనాలను, 8 మంది అనుమానిత వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు.

అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామన్నారు.”కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను తరువాత గ్రామస్థులతో విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు  సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారని తెలిపారు.

ఈ “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్లో విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు , విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, రూరల్  ఎస్ఐ వి.అశోక్ కుమార్, మాతా మూర్తి, గంట్యాడ ఎస్ఐ సాయి కృష్ణ మరియు 60మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పని సరి

Satyam News

తిరుమలలో నెయ్యి కల్తీతో లడ్డూ జిహాద్‌..?

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

Leave a Comment