చిత్తూరుహోమ్

తిరుమల లడ్డు కల్తీలో బయటపడ్డ ‘పెద్దల’ హస్తం?

#TirumalaLaddu

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నది. కల్తీ జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై వీ సుబ్బారెడ్డికి దీనితో ప్రమేయం ఉన్నట్లుగా కూడా దాదాపుగా విచారణ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.

టీటీడీ పాలక చైర్మన్‌గా ఆయన పేరును ప్రకటించినప్పుడే, ఆయన రాకను హిందూ భక్తులు వ్యతిరేకించారు. ఆ హడావుడిలో వికీపీడియాలో ఈయన మతాన్ని హిందువుగా మార్చి, ఎన్నో సార్లు అయ్యప్ప మాల వేసుకొన్న మహా హిందూ భక్తుడు అని ఆ నిరసనల మీద నీరు చల్లారు. వై.వి.సుబ్బా రెడ్డి, 2019–2023 మధ్య టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. కల్తీ లడ్డు కుంభకోణంలో ప్రమేయం ఉన్న పోమిల్ జైన్ (ఎ3), కైలాష్ చంద్ మాంగ్లా, పీ.పి. శ్రీనివాసన్ లు టీటీడీ చైర్మన్‌గా వున్న వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో  25.05.2022న  కలిసినట్లు విచారణాధికారులు ధృవీకరించుకున్నారు.

మరో విషయం కూడా విచారణాధికారుల దృష్టికి రావడం సంచలనం కలిగిస్తున్నది. అదేమిటంటే అప్పటి చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి పీఏ కడురు చినప్పన్న, టీటీడీకి నెయ్యి సరఫరాదారు అయిన ప్రీమియర్ అగ్రి పుడ్స్ ప్రతినిధి మరియు హవాలా ఏజెంట్‌గా చెప్పబడుతున్న అమన్ గుప్తా నుంచి న్యూఢిల్లీ పటేల్ నగర్ మెట్రో సమీపంలో సుమారు రూ.20 లక్షలు స్వీకరించాడు.

అదేవిధంగా ప్రీమియర్ అగ్రి పుడ్స్ మేనేజర్ విజయ్ గుప్తా నుండి సుమారు రూ.30 లక్షలు న్యూఢిల్లీలోనే పలు సందర్భాల్లో స్వీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తిరుమల లడ్డు కల్తీ విషయం వై వీ సుబ్బారెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవడానికి వీల్లేని తిరుగులేని సాక్ష్యాలను కూడా విచారణాధికారులు సేకరించారు.

16.05.2022న భోలే బాబా ఆర్గానిక్ డైరీపై ఒక అజ్ఞాత ఫిర్యాదు వచ్చింది. వారు సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరుగుతున్నదనేది ఆ ఫిర్యాదు సారాంశం. దాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు విచారణ కోసం అప్పగించారు.

ఆపై, 20.05.2022న, చైర్మన్ ఆదేశాల మేరకు, మూడు కంపెనీల (ప్రీమియర్ ఆగ్రో, వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీ) నెయ్యి శాంపిల్స్ టిన్‌ల నుండి సేకరించి సెంట్రల్ పుడ్ టెక్నలాజికల్ రీసర్చ్ ఇనిస్ట్యూట్ (CFTRI) ల్యాబ్, మైసూరుకి పంపారు. CFTRI నివేదిక (ఆగస్టు 2022)లో అన్ని శాంపిల్స్ వెజిటబుల్ ఆయిల్ కల్తీతో ఉన్నట్లు ధృవీకరించింది. అయినప్పటికీ ఏ చర్య తీసుకోకుండా, ఆ కంపెనీలకు 2024 వరకు సరఫరా కొనసాగించేందుకు అనుమతించారు.

దీనివెనుక మతలబును ఇప్పుడు దర్యాప్తు అధికారులు ఛేదించారు. 2019-2024 మధ్య  సుమారు 60,37,351 కిలోల (60.37 లక్షల కిలోలు) కల్తీ నెయ్యిని నాలుగు ప్రధాన సంస్థల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీని మొత్తం విలువ ₹240 కోట్లకు పైగా ఉంది. ప్రతి కిలో నెయ్యికి ఆయన పీఏ కడురు చినప్పన్న రూ. 25/- లంచం డిమాండ్ చేశాడట.

అందుకు అంగీకరించి, తమ ఫ్యాక్టరీపై తనిఖీ చేయవద్దని జైన్ అభ్యర్థించాడట. పాలు సేకరించకుండానే, ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ ప్లాంట్‌లో పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పమోలిన్ వంటి చవకైనవి ఉపయోగించి, కొద్ది మొత్తంలో నెయ్యిని కలిపి తయారు చేశారు.

ల్యాబ్ పరీక్షల విలువలు సాధారణంగా కనిపించేలా మరియు వాసన కూడా ఉండేలా ప్రమాదకరమైన బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యి ఫ్లేవర్  వంటి విషతుల్యమైన కెమికల్స్ కలిపారట. ఈ విషయాలన్నీ విచారణలో తేలాయి. వైవీ సుబ్బారెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు సుప్రీంకోర్టు నియమించిన సిట్ అడిగితే ఇవ్వలేదు.

బ్యాంక్ స్టేట్‍మెంట్ సిట్‍కు ఇచ్చేందుకు భయపడి, ఆఘమేఘాల మీద కోర్టును ఆశ్రయించి వ్యక్తిగత గోప్యం క్రింద నిలువరించారు. ఇప్పుడు అందుకు తగిన సాక్ష్యాలు బయటపడ్డాయి. ఇప్పుడు న్యాయ స్థానం కూడా ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Related posts

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి

Satyam News

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందా?

Satyam News

Leave a Comment