25.2 C
Hyderabad
September 20, 2026
కడపహోమ్

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

#Jagan

2025.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ జగన్‌కి ఏమాత్రం కలిసిరాలేదు.. ఈ ఏడాది పదకొండు నెలల కాలంలో జగన్‌ మోహన్‌ రెడ్డి వారానికి ఒకసారి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌ టు అమరావతి తాడేపల్లి ప్యాలెస్‌కి ఫ్లయిట్‌ ఎక్కడం, దిగడం మినహా… ఆయన గ్రాఫ్‌లో మార్పు లేదు.. ఈ ఏడాది కాలంలో జగన్ ఇమేజ్‌, క్రేజ్‌ పది అడుగులు పడిపోవడం తప్ప, ఇంచ్‌ కూడా పెరగలేదని ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేలలోనే తెలిసిపోతోందని గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు..

ఇక, ఈ ఏడాది క్లయిమాక్స్‌కి ముందు ప్రీ క్లయిమాక్స్‌లో జగన్‌కి మరింత మైనస్‌… అక్రమాస్తుల కేసులో కోర్టుకి హాజరు కావడం… ఆరేళ్లుగా కోర్టు ముఖం చూడని జగన్‌.. తాజాగా నాంపల్లి ఏసీబీ కోర్ట్‌ మెట్లు ఎక్కారు.. 2025..కలిసి రాకపోవడంతో 2026పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పార్టీ ఆశలు, అవకాశాలని తిరగరాయాలనుకుంటున్నాడు.. అయితే, వచ్చే ఏడాది కేలండర్‌ స్టార్టింగ్‌లోనే వైసీపీకి మరో స్కెచ్‌ వేయడానికి రెడీ అవుతున్నారు కూటమి నేతలు.. ఆ  పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తున్నాడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

2026 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఫిబ్రవరిలో లోకల్‌ కోడ్‌ మొదలు పెడితే మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయి.. స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా లేదనేది ఓపెన్‌ ఫ్యాక్ట్‌.. అంటే, ముందే చేతులు ఎత్తేయడం ఖాయం. పులివెందుల సహా.. దాదాపు అన్ని మునిసిపాలిటీలలో జెండా ఎగురవేయాలని చంద్రబాబు పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు..

లోకల్‌ వార్‌లో వైసీపీకి ఎంత నష్టం జరిగితే, అది కూటమికి అంత లాభం.. అప్పటికి చంద్రబాబు సర్కార్‌ పవర్‌లోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది.. ఈ రెండేళ్లలో జగన్‌ పార్టీ ప్రభావం తీసికట్టుగా మారుతోంది.. సుమారు నూట యాభై నియోజకవర్గాలలో వైసీపీ ఇన్‌చార్జ్‌లు ఫీల్డ్‌లో పోరాటం చేయకుండా చేతులు ఎత్తేశారు. ఇక, స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి చెందితే, ఆ ప్రభావం మరో ఏడాది పడనుంది.. అంటే, వైసీపీ నేతల ఆత్మస్థయిర్యం, నైతికత దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది.. అందుకే, కూటమి నేతలు స్థానిక వార్‌ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఇలా, 2026 ఏడాది ప్రారంభంలోనే జగన్‌కి తొలి పంచ్‌ ఇవ్వాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కార్‌.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..

Related posts

బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి

Satyam News

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News

మత్స్యావతారంలో కనువిందు చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News

అబద్ధాల పునాదులపై ఎంత కాలం ఇలా…?

Satyam News

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

Satyam News

Leave a Comment