విజయనగరం హోమ్

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

#KondapalliSrinivas

తండ్రి మ‌ర‌ణించినప్పుడే రాజ‌కీయాలు చేసిన వ్య‌క్తి మాజీ సీఎం జ‌గ‌న్ అని రాష్ట్ర ఎన్.ఆర్‌.ఐ, సెర్ఫ్ శాఖ‌మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. క‌లెక్ట‌రేట్ లో స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న జ‌యంతి సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ కు వ‌చ్చిన మంత్రి కొండ‌ప‌ల్లి  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్‌ పోడియం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ ను,ఆయ‌న పార్టీని ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షానికి ప‌నికి రాకుండా కూర్చొబెట్టిన ఆయ‌నకు బుద్ది రాలేద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

79వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లకు కూడా క‌నీసం  హాజ‌రు కాకుండా ఆయ‌న ఉన్నారంటే ఆయ‌న‌కు అహం ఎంత ఉన్న‌దో అర్ద‌మ‌వుతోంద‌న్నారు. ప‌బ్లిక్ ఫ‌స్ట్ పార్టీ నెక్స్ట్ అని కాకుండా అటు పార్టీకూడా ఫ‌స్ట్ కాకుండా నియంత‌లా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం ఎవ్వ‌రూ హ‌ర్షించ ద‌గ్గ విష‌యం కాద‌ని మంత్రికొండ‌ప‌ల్లి అన్నారు. దేశం ఫ‌స్ట్ అన్న భావ‌నే లేకుండా జ‌గ‌న్  వ్య‌వ‌హారించిన తీరు ఏ ఒక్క‌రూ హ‌ర్షంచ‌ర‌ని మంత్రి కొండ‌ప‌ల్లి ఎద్దేవా చేసారు.

Related posts

మరింత ప్రభావం చూపించనున్న అల్పపీడనం

Satyam News

దేవుడి భూములకే ఎసరు పెట్టిన పేర్ని నాని!

Satyam News

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

Satyam News

Leave a Comment

error: Content is protected !!