ప్రపంచంహోమ్

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

#Kandahar

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలూ పరస్పర దాడులతో తెగబడుతున్నాయి. పాకిస్తాన్‌ రాత్రికి రాత్రే అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలపై తాలిబాన్ ప్రభుత్వ బలగాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. ఇది ఇప్పటివరకు తమ మిత్రులుగా భావించిన తాలిబాన్‌పై నేరుగా చేసిన తొలి దాడి కావడం గమనార్హం.

ఈ పరిణామాలను “ఓపెన్ వార్”గా పాకిస్తాన్ పేర్కొనడం వల్ల అణ్వాయుధాలు కలిగిన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ దాడులు అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్, తాలిబాన్ నాయకత్వం ఉన్న కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

అలాగే పక్తియా ప్రావిన్స్‌లో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్లామాబాద్ గతంలో తాలిబాన్ మద్దతుతో పనిచేస్తున్న మిలిటెంట్లపై మాత్రమే దాడులు చేసినప్పటికీ, ఈసారి నేరుగా తాలిబాన్ సైనిక కార్యాలయాలపై క్షిపణి దాడులు జరిపినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి.

ప్రతీకార దాడులు తీవ్రతరం చేసిన తాలిబాన్లు

అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భూమిపై కూడా కాల్పులు జరిగాయి. తాలిబాన్ ప్రతీకార దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ, “మా సహనం నశించిపోయింది. ఇప్పుడు ఇది మీ (అఫ్గానిస్తాన్)తో మా మధ్య ఓపెన్ వార్” అని హెచ్చరించారు.

రెండు దేశాల మధ్య 2,600 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. అఫ్గానిస్తాన్ తమ దేశంలో మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే తాలిబాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, పాకిస్తాన్ భద్రతా సమస్యలు అంతర్గత అంశమని పేర్కొంటోంది.

పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కలిగిన దేశం కాగా, సైనిక సామర్థ్యం పరంగా అఫ్గానిస్తాన్ కంటే ఎంతో బలంగా ఉంది. అయితే తాలిబాన్ గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉంది. అమెరికా నేతృత్వంలోని బలగాలతో దశాబ్దాల పాటు పోరాడి 2021లో తిరిగి అధికారంలోకి వచ్చింది. రష్యా, చైనా, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ కూడా సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపింది.

పాక్ ను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం

తాలిబాన్ ప్రతినిధి జబైనుల్లా ముజాహిత్ మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం కాబూల్, కందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసినట్టు ధృవీకరించారు. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టౌల్లా తరార్ ఈ డ్రోన్లన్నింటినీ కూల్చివేశామని, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

రెండు పక్షాలు భారీ నష్టాల్ని పేర్కొన్నాయి. పాకిస్తాన్ కథనం ప్రకారం 133 తాలిబాన్ యోధులు మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ కథనం ప్రకారం 55 పాకిస్తాన్ సైనికులు మృతి చెందగా, అనేక పోస్టులు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.

ఇటీవల పాకిస్తాన్ తహ్రీక్-ఎ-తాలిబాన్ (TTP) మరియు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల శిబిరాలపై కూడా దాడులు చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం ఆ దాడుల్లో 13 మంది పౌరులు మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా చర్యల భాగంగా 90 మంది అఫ్గాన్ పౌరులను నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

అఫ్గానిస్తాన్ నంగర్‌హార్ రాష్ట్ర మీడియా ఒక ఆత్మాహుతి దళానికి సంబంధించిన చిత్రాలను విడుదల చేస్తూ, వారు ప్రధాన లక్ష్యాలపై దాడులకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ పరిణామాలతో పాకిస్తాన్ పట్టణాల్లో మిలిటెంట్ దాడులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

Satyam News

Leave a Comment