కృష్ణహోమ్

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

#VenigandlaRamu

ప్రజల విశ్వాసానికి కూటమిపాలన నిదర్శనం అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి, వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న అన్నారు. నందివాడ మండలంలోని అత్కూరు యూటీ మీడియం డ్రైన్ లో పూడిక తీత పనులు ప్రారంభమయ్యాయి.

రూ.40 లక్షల నిధులతో చేపట్టిన పనులను పెద లింగాల గ్రామం వద్ద గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. డ్రైన్ లో పూడిక తీయకపోవడం వల్ల వరదలు వచ్చినప్పుడు జరుగుతున్న నష్టాన్ని ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… నేడు డ్రైన్ లో పూడికతీత పనుల వల్ల నందివాడ మండలంలోని అత్యధిక గ్రామాల్లో వరద ముంపు తగ్గుతుందన్నారు. తుఫాన్లు వచ్చిన, వరదలు వచ్చిన గ్రామాలు సురక్షితంగా ఉంటాయని, ప్రజలతో పాటు ఆక్వా రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా కూటమి వచ్చేనాటికి కాలువలు, డ్రైన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయన్నారు. వారి ధన దాహానికి రైతులు, ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిపాలనలో నియోజకవర్గంలోని మేజర్ డ్రైన్లు, పంట కాలవల్లో సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు ఏసుపాదం, కమలయ్య, సాల్మన్ రాజ్, సింగవరపు ప్రభాకర్, మద్దలి ఇస్సాకు, ఉమామహేశ్వరరావు, నరేష్,రాంబాబు, సతీష్, రమణ, గ్రామ నాయకులు తాతినేని మురళి, కలపాల వీరభద్రరావు, ఖడ్గ రామారావు, గండికోట నరసింహారావు, దిలీప్, రాంబాబు, కుంటం రాజు, అధికారులు EE డ్రైనేజ్ కిరణ్ బాబు, DE డ్రైనేజ్ నాగేంద్రబాబు, AE ఉదయ్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి?

Satyam News

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News

మహా జన సముద్రం గా మారిన మేడారం

Satyam News

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

Leave a Comment