25.2 C
Hyderabad
September 20, 2026
ఖమ్మంహోమ్

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

#Ponguleti

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఉద్యమకారులు కలిశారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, జైలుకు వెళ్ళని వారు, ఉద్యమంలో పాల్గొన్న వారి కి అందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని అన్నారు.

చాలామంది ఉద్యమకారులపై కేసులు కాలేదని అలాంటి వారిని కూడా గుర్తించి 250 గజాల ఇంటి స్థలానికి లబ్ధిదారులుగా చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. 250 గజాల ఇంటి స్థలం కోసం ప్రత్యేకమైన మంత్రివర్గ ఉపసంఘం వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తించలేదని తద్వారా ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని చాలామంది ఉద్యమకారులకు ఆరోగ్య సమస్యలు వచ్చి  ఎలాంటి పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారని అలాంటి ఉద్యమకారులందర్నీ గుర్తించి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చాలని కోరారు.

త్వరలో అన్ని జిల్లాలలో పర్యటించి ఉద్యమకారులను కలుస్తానని పిడమర్తి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్స్ డాక్టర్ బొమ్మెర స్టాలిన్, BSF రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, ఉద్యమకారులు నక్క మహేష్ జోగు గణేష్ మీసాల మహేష్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

Satyam News

కవిత పార్టీపై కేటీఆర్ తొలి స్పందన…

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam News

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌

Satyam News

Leave a Comment