కర్నూలుహోమ్

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

#ChandrababuNaidu

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ఖనిజ రంగంలో కీలక మైలురాయిగా ఈ ప్రాజెక్టు నిలవనుంది.

జొన్నగిరిలో రూ.320 కోట్ల వ్యయంతో నిర్మించిన గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, అదే సమయంలో రెండో యూనిట్‌కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 1,477 ఎకరాల విస్తీర్ణంలో గనుల తవ్వకాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. భూమి అడుగున సుమారు 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు భౌగోళిక పరిశోధనల్లో గుర్తించినట్లు సమాచారం. ఈ నిక్షేపాల ఆధారంగా దీర్ఘకాలికంగా బంగారం ఉత్పత్తి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏడాది సుమారు వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. దేశంలో బంగారం దిగుమతులపై ఆధారాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు ఖనిజ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ఈ ప్రాజెక్టు ప్రోత్సాహకంగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జొన్నగిరి బంగారు గని ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద వినియోగంలో మరో కీలక ముందడుగు పడనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

అంతర్జాతీయ చమురు సరఫరాకు మళ్లీ ముప్పు?

Satyam News

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కార్యాచరణ

Satyam News

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

జాతీయ మీడియాలో లోకేష్‌పై సంచలన కథనాలు

Satyam News

Leave a Comment