శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

#Srikakulam

శ్రీకాకుళం నగరం 31వ డివిజన్ లోని స్థానిక సెయింట్‌ హోమ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో దైవజనులు అత్యధికంగా పాల్గొని చర్చి ఫాదర్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 31 డివిజన్ టిడిపి ఇన్చార్జ్ ఏపి ప్ర‌భుత్వ క‌నీస‌వేత‌నాలు స‌ల‌హా మండ‌లి డైరెక్టర్ సూరిబాబు పాల్గొని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు. అంత‌కు ముందు స్ధానిక ఎమ్మెల్యే గొండు శంక‌ర్ పంపిన కేక్‌ను క‌ట్ చేసి అంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

అంద‌రి జీవితాల్లో వెలుగులు ఆ యేసు ప్ర‌భువు  నింపాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంజి అనిరోజ్, ఆర్ ప్రసాద రావు, వై అబ్రహాం, అన్నిరోజ్, మజా రమణ,ఆసనాల ఆశీర్వాదం, సకలబత్తుల శ్రీనివాస్, సీమ్మంట్ రమణ, శ్రీనివాస్ శంకర్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంజాబ్ లో అద్భుతం: 90శాతం మందికి కరెంటు బిల్లు లేదు…

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Satyam News

విశాఖ ఉక్కు సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్

Satyam News

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

నందికొట్కూరు లో డ్రగ్ చాక్లెట్లు?

Satyam News

Leave a Comment