25.2 C
Hyderabad
September 20, 2026
కర్నూలుహోమ్

మెడికల్ కాలేజీలకు కులం రంగు పులుముతున్న జగన్

#KIMSHospitals

కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పి 11తో సరిపెట్టుకోమని వైసీపీని మూలన కూర్చోబెట్టినా.. ఆ పార్టీ ఇంకా బుద్ధి మార్చుకోలేదు. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉన్న కిమ్స్ కు వైసీపీ కులం రంగు పులుముతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో ఆస్పత్రులు నడుపుతున్న కిమ్స్ అదోనిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోన్న మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. దాదాపు 25 ఆస్పత్రులు, పది వేల పడకలతో వైద్య రంగంలో సేవలు అందిస్తోంది.

ప్రభుత్వ అభివృద్ధి విధానానికి ఆకర్షితులైన  కిమ్స్ యాజమాన్యం ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడాన్ని అభినందించాల్సిందిపోయి.. వైసీపీ బెదిరింపులకు దిగుతోంది. కిమ్స్ పై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా, ఆ సంస్థ యజమాని బొల్లినేని భాస్కరరావుపై బెదిరింపులకు దిగుతోంది. విపక్షంలో ఉన్న వైసీపీ ఇలాంటి దుష్ప్రచారం చేయడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. 

కిమ్స్ యాజమాన్యం కమ్మ సామాజికవర్గం కావడం వల్లే ప్రభుత్వం వైద్య కళాశాలను అప్పగిస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారాన్ని అంతా ఖండిస్తున్నారు. వైసీపీ బ్లడ్ లోనే ఇలాంటి కుల పిచ్చి ఉంచుకుని.. ఇతరులకు ఆపాదించడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 37 మంది డీఎస్పీలకు పదోన్నతి ఇస్తే అందులో 35 మంది కమ్మవారే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసింది వైసీపీ .

అలాంటి పార్టీని ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు తన మంది మాగధులు అందరూ సొంత సామాజికవర్గం వారే ఉండేలా చూసుకున్న వైసీపీ అధినేత జగన్ రెడ్డి.. గురివింద గింజలా తన నలుపు దాచుకోవడం కుదురుతుందా? 2019 నుంచి 24 వరకు సీఎంవోలోనూ.. సలహాదారులుగాను తన వారినే జగన్ రెడ్డి ఉంచుకోవడం మరచిపోయారా?

సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయి రెడ్డి? ఏ కులం వారు? సీఎంవోలో చక్రం తిప్పిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, అజయ కల్లంరెడ్డి ఎవరు? ఏ కులం వారు? డబ్బులు లేని కార్పొరేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అప్పగించి..  ఆర్టీసీ, ఆప్కాబ్‌, పరిశ్రమల వంటి కీలకమైన బాధ్యతలను రెడ్డి నాయకులకు అప్పగించడం ఎవరైనా మరచిపోతారా?

ఏపీఐఐసీ, ఫైబర్‌నెట్‌, డిజిటల్‌ కార్పొరేషన్‌, ఏపీఎంఎస్ఐడీసీ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆప్కాబ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, స్పోర్ట్సు అథారిటీ, ఏపీ మార్కెఫెడ్‌, ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌… ఇవన్నీ రాష్ట్రస్థాయిలో బలమైన, కీలకమైన కార్పొరేషన్లు.

వీటన్నింటినీ జగన్ సొంత సామాజికవర్గ నేతలకు అప్పగించలేదా? రాష్ట్రంలో యూనివర్సిటీలకు రెడ్డి సామాజికవర్గం వారు తప్ప మరొకరు ఆ ఐదేళ్లు వీసీగా పనిచేశారా? వేరొకరికి చాన్స్ ఇచ్చారా? చివరికి శ్రీవారి సేవ చేసే టీటీడీని సొంత కుటుంబ సభ్యులకు అప్పగించి.. కలియుగ దైవాన్ని నిలువునా దోచేశారు కదా…. ఐదేళ్లు కుల రాజకీయమే చేసిన వైసీపీ ఇప్పుడు మళ్లీ విషం చిమ్మే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం.

Related posts

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

2025 ఆసియా కప్ ఫైనల్: భారత్ ఘన విజయం

Satyam News

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

Satyam News

డేరా బాబా పై హత్యకేసు కొట్టివేసిన హైకోర్టు

Satyam News

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

Satyam News

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Satyam News

Leave a Comment