26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

#Ponguleti

భూముల ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి రైతులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం ‘ధరణి’ ద్వారా సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు చుట్టంలా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ (ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

పాత టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి సెంటీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వం వచ్చేలా ఆధునిక ‘రోవర్స్‌’ సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 600 రోవర్లను జిల్లాలకు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా కేటాయించామని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.ధరణిలో జరిగిన అక్రమాలపై సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పూర్తయ్యిందని, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఆడిట్‌ చేపడతామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Related posts

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

Satyam News

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్….. మళ్లీ భూమిపూజపై క్లారిటీ.!

Satyam News

రామడుగు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం

Satyam News

Leave a Comment