ప్రత్యేకంహోమ్

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

#TirumalaGhee

2019–24 మధ్య తిరుమలలో కల్తీ నెయ్యి వాడింది నిజం. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు….. 600 పేజీల ఛార్జ్‌షీట్‌లో హిందువులు భయపడే విషయాలను సుప్రీంకోర్టు నియమించిన సిట్ వెల్లడించింది.

అంతే కాదు… ఈ నేరం చేసిన వైసీపీ కేటుగాళ్ల గుట్టురట్టు చేసింది. మొత్తం కథ నడిపింది అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కె. చిన్న అప్పన్న అనే విషయం కూడా చార్జిషీట్ లో స్పష్టం అయింది. శ్రీవారి తిరుమల గుడిని అప్రతిష్టపాలు చేయటమే ప్రధాన అజెండాగా ఈ నేరం సాగింది.

సిట్ నిర్ధారించిన అంశాలు

చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ

కెమికల్స్ తో నెయ్యి కల్తీ చేయడం

సాక్ష్యాల్ని నాశనం చేయడం

హవాలా ద్వారా సొమ్ము తరలింపు

టెండర్ నిబంధనల్లో మార్పు

హనికరమైన ఆహార పదార్థాల విక్రయం

నమ్మక ద్రోహం

ప్రభుత్వ అధికారులకు లంచాలు

టీటీడీకి నష్టం కలిగేలా తెలిసి మోసం చేయడం

నకిలీ / ఫోర్జరీ పత్రాల తయారీ

భక్తుల మనోభావాలు దెబ్బతీయడం

ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభావితం చేయడం

వాణిజ్యసంస్థల ద్వారా అనుచిత లబ్ధి పొందడం

అధికార దుర్వినియోగం

అన్నిటికీ మించి హిందువుల మనోభావాలతో ఆడుకోవటం

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కుళ్ళిపోయిన జంతు మాంసం వాడారు అని 23.07.2024న గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మికమైనది ఈ సంస్థ. ఒక జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాగా వైసీపీ నేతలు చెబుతున్నట్లు వారికి ఎవరూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.

వైసీపీ ప్రచారం చేస్తున్నది ICAR-NDRI అనే ఒక రీసర్చ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్. NDDB కంటే చిన్న సంస్థ ఇది. అయినా కూడా ICAR-NDRI రిపోర్ట్ లో, ఎక్కడా జంతు కొవ్వు లేదు అని కంప్లీట్ గా చెప్పలేదు. “Limit of Detection (LOD): ≥ 10%” తీసుకున్నాం అని చెప్తున్నారు. అంటే జంతు కొవ్వు 10% కంటే తక్కువ ఉంటే, ఈ రిపోర్ట్ లో రాదు అని వాళ్ళే చెప్తున్నారు. నిపుణుల అభిప్రయరం ప్రకారం, PCR టెస్ట్ లో జంతు కొవ్వు కలిపింది లేదా తెలియదు. MTDNA టెస్ట్ లో మాత్రమే తెలుస్తుంది. ఇందులో వైసీపీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.

ఇంత బరితెగించి అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అంటే లడ్డు కల్తీ కేసులో సుప్రీంకోర్టు నిర్ధారించిన నిందితులలో వైసీపీ నాయకుల బంధువులు ఉన్నారు. వారి వివరాలు:

1. పల్లి ఈశ్వర్ రెడ్డి (A-25) ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు, టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. నేరం: నెయ్యి కల్తీ అని CFTRI ల్యాబ్ నివేదికలు వచ్చినప్పటికీ, వాటిని ఉన్నతాధికారులకు తెలియకుండా తొక్కిపెట్టి, కల్తీ నెయ్యి సరఫరా కొనసాగేలా సహకరించారు.

2. శ్రీ పెరూరు జగదీశ్వర రెడ్డి (A-28) ఇతను భూమన కరుణాకర్ రెడ్డి బంధువు ఇతను టీటీడీలో జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) మరియు ప్లాంట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యుడు. నేరం: డైరీ ప్లాంట్‌లను సందర్శించినప్పుడు అవి అనర్హమైనవి అని తెలిసినా, తప్పుడు అనుకూల నివేదికలు ఇచ్చి వారికి టెండర్లు దక్కేలా చేశారు.

3. డాక్టర్ కాసిరెడ్డి హరినాథ్ రెడ్డి (A-31) ఇతను భూమన కరుణాకర్ రెడ్డి బంధువు ఇతను టీటీడీలోని ఎస్వీ గోసంరక్షణ శాల డైరెక్టర్ (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు). నేరం: అధికార దుర్వినియోగానికి పాల్పడటం మరియు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కుట్రలో భాగస్వామిగా ఉండటం. 

4. శ్రీ మద్ది విజయభాస్కర్ రెడ్డి (A-34) ఇతను వైవీ సుబ్బారెడ్డి బంధువు ఇతను డైరీ నిపుణుడు మరియు ప్లాంట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యుడు. నేరం: అర్హత లేని డైరీలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం మరియు కల్తీని గుర్తించే ‘బీటా సిటోస్టెరాల్’ పరీక్ష నిబంధనల నుండి కొన్ని కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలని తప్పుడు సిఫార్సులు చేయడం.

5. వై. వి. సుబ్బారెడ్డి పీఏ కదురు చిన్నప్పన్న (A-24),  టీటీడీ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు పీఏ (PA)గా పనిచేశారు. చిన్నప్పన్న లంచాలు వాసులు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Related posts

రోజా కు బిగుసుకుంటున్న అవినీతి ఉచ్చు

Satyam News

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

మత్తు మందు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Satyam News

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

పాడి రైతులకు క్రెడిట్‌ కార్డులు‌….. ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్‌

Satyam News

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News

Leave a Comment