26.1 C
Hyderabad
September 23, 2026
సంపాదకీయంహోమ్

బూతుల పర్వం వెనక ఐప్యాక్‌ స్కెచ్‌….??

#YSJagan

మైనస్‌ ఇన్‌టు మైనస్‌… ప్లస్‌ అవుతుంది.. ఇది మ్యాథ్స్‌ ఫార్ములా.. ఉష్ణం ఉష్ణేణ శీతలం…. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇవి ఆర్యోక్తులు.. ఇవి ప్రజల్లో ఉన్న నానుడి… సరిగ్గా ఇదే సూత్రాన్ని వైసీపీ అనుసరిస్తుందా…?? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. ముఖ్యంగా వైసీపీ గత పాలనపై ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు.. అయిదేళ్ల పాలనకు రిటర్న్‌ గిఫ్ట్‌గా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.. తన నిర్ణయాలకు తనకు శాలువా కప్పి సన్మానాలు చేయాలని గొంతు చించుకుంటున్న జగన్‌కి ఏడాదిన్నరగా ప్రజల మూడ్‌ అర్ధం అయింది.. తన నిరంకుశ, అరాచక పాలనపై ప్రజల మనసు మారలేదని గ్రహించారు.. ఇక్కడే జగన్‌, ఐ ప్యాక్‌ టీమ్‌ పక్కా సర్వేలతో యాంటీ క్యాంపెయినింగ్‌ ప్రారంభించిందనే చర్చ మొదలయింది.

అదే సానుభూతి అస్త్రం.. తండ్రి వైఎస్‌ మరణాన్ని అడ్డుపెట్టుకొని పదేళ్ల పాటు రాజకీయం చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు జగన్‌.. ఓదార్పుయాత్ర ఆయన రాజకీయ జీవితంలో కీలక అస్త్రం.. ప్రజల ముందు అమాయకుడిగా నటించి, వారి మెప్పు పొంది, పవర్‌లోకి రాగానే ప్యాలెస్‌ దాటకుండా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారనే వాదన ఉంది.. జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, ఆయన రాష్ట్రానికి చేసిన డ్యామేజ్‌ ప్రజల స్మృతిపథం నుండి చెరిగిపోలేదు.. అందుకే, అంబటి, జోగి రమేష్‌, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వల్లభనేని వంశీ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి లాంటి నేతలతో భారీ స్కెచ్‌ వేశాడు జగన్‌.. వారితో బూతులు తిట్టించడం, వారిపై అధికార పార్టీ కేడర్‌ రెచ్చిపోతే తమను ఎటాక్‌ చేస్తున్నారని విక్టిమ్‌ కార్డ్‌ ప్రయోగిస్తున్నాడు.. వారి ఫ్యామిలీలతో జగన్‌ నాటకానికి తెరదీస్తున్నారు.. తమ ఇళ్లల్లోకి చొరబడి కూటమి నేతలు హత్యాయత్నం చేస్తున్నారని అభాండాలు వేస్తున్నారు..

ఇదంతా పక్కా వ్యూహంలా కనిపిస్తోంది.. వైసీపీపై ప్రజల్లో సానుభూతి రావడం లేదు.. అందుకే చిత్తు చిత్తుగా ఓడించారు.. ప్రజల మనసు గెలవాలంటే, తమను కొడుతున్నారని, చంపబోతున్నారని, తమకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు.. కానీ, గత అయిదేళ్లు ఈ నేతలు ఎంతటి అరాచకం చేశారో, ఎలాంటి బూతులు లంకించుకున్నారో, ఫినాయిల్‌ వేసినా ఆ నోటికంపు వాసన సోషల్ మీడయాలో నేటికీ కళ్లకు, చెవులకి కడుతూనే ఉంటుంది.. వాటి నుండి ప్రజలను డైవర్ట్ చేయాలంటే సానుభూతి ఒక్కటే పరిష్కారం.. అందుకే, బూతులు తిట్టి, రెచ్చగొట్టి, జైలుకు వెళ్లి… తమ తప్పులు, పాపాలను కడిగేసుకొని ప్రజల ముందు సుప్పిని సుద్దపూసని డ్రామాలు ఆడుతున్నారు.. మరి, అయిదేళ్లు రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చి ఈ నేతలు చేసిన పాపాలు కరిగిపోతాయా..?? ప్రజల మనసుని వీరి దొంగ నాటకాలు మారుస్తాయా..?? అంత తేలికగా నాటి జమానా తప్పుడు లెక్కలను కడిగేసుకోగలరా.??? అనేది చూడాలి..

Related posts

జగనన్న ఇళ్ల స్థలాల వెనుక వెయ్యి కోట్ల భూ దందా

Satyam News

క్యూలైన్లలో భక్తులు  సంయమనం పాటించాలి

Satyam News

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పని సరి

Satyam News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

“జిందగీ ఇన్ టూ షేడ్స్” ఫిల్మ్ మేకర్’గా డాలి టోమర్’కి ఉజ్వల భవిష్యత్

Satyam News

‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా హైదరాబాద్

Satyam News

Leave a Comment