ఆధ్యాత్మికంహోమ్

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో హిందువుల అత్యంత పవిత్రమైన చార్‌ధామ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయ కమిటీలు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

యాత్రలో భాగంగా ఇతర ప్రధాన ఆలయాలైన కేదార్‌నాథ్ ఈ నెల 22న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ఆలయాన్ని 23న ఉదయం 6:15 గంటలకు తెరవడానికి ముహూర్తం ఖరారు చేశారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22వ తేదీ నుంచే హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ చార్‌ధామ్ యాత్ర నవంబర్ నెల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రత, వైద్యం మరియు రవాణా ఏర్పాట్లు చేసింది. హిమాలయాలలోని ఈ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Related posts

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News

జగన్‌ మత ఉగ్రవాది…..  బాంబు పేల్చిన విజయసాయి!

Satyam News

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి

Satyam News

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

Satyam News

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News

మోదీపై వైసీపీ ఎటాక్… కాంగ్రెస్ గూటికి జగన్..?

Satyam News

Leave a Comment