26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

విజయ్ జగన్ ఒక బొకే…. పరువు పోయిందిగా….

ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పక్కనే కూర్చున్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వేదికపై బొకేను లాగేసుకోవడం, వింత హావభావాలు ప్రదర్శించడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. స్టేజీ మీద ఆశీర్వదించే సమయంలో జగన్, భారతి దంపతులు జంటగా కాకుండా విడివిడిగా వ్యవహరించడం, ఆపై అక్కడి పెద్దలు జోక్యం చేసుకుని వారిని పక్కపక్కన నిలబెట్టడం వంటి దృశ్యాలను చూసి అక్కడి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా వధూవరుల కోసం విజయ్ తెచ్చిన పూల బొకే ను తనకోసమే తెచ్చిన బొకే గా భావించి జగన్ తీసుకో బోవడం దాన్ని విజయ్ లాగేసు కోవడం ఇప్పుడు వైరల్ అయింది. దీంతో జగన్ పరువు పూర్తిగా పొయింది.మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంలో జగన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయనతో విజయ్ భేటీ అవ్వడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ భేటీ వల్ల హిందూ ఓటర్ల మనోభావాలు దెబ్బతిని విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనని వారు భయపడుతున్నారు. జగన్ తన రాజకీయ ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విజయ్‌ను వాడుకుంటున్నారని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని పలువురు వాదిస్తున్నారు.

గతంలో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా తమ హీరో ఇమేజ్ విషయంలో ఇప్పటికే జాగ్రత్తగా ఉన్న అభిమానులు, ఇటువంటి వ్యక్తిగత భేటీలు అనవసర రాజకీయ రంగు పులుముకోకూడదని ఆకాంక్షిస్తున్నారు.

Related posts

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News

మనసు దోచుకున్న మహిళా క్రికెటర్లు

Satyam News

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

Satyam News

ఉద్య‌మాల నిప్పుక‌ణిక స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న‌

Satyam News

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

Satyam News

Leave a Comment