ప్రపంచం హోమ్

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

#Sydney

సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఇద్దరిలో ఒక వ్యక్తిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. సాజిద్ అంతర్జాతీయ ప్రయాణాల కోసం భారతీయ పాస్‌పోర్టును ఉపయోగించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

సాజిద్ అక్రమ్ (50) తన కుమారుడు నవీద్ అక్రమ్ (24)తో కలిసి ఈ దాడికి పాల్పడి 15 మంది పౌరులను హతమార్చినట్టు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. ఈ దాడికి ‘ఇస్లామిక్ స్టేట్’ భావజాలంతో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

బీబీసీ కథనం ప్రకారం, ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ అధికారులు సాజిద్ అక్రమ్ భారతీయ పాస్‌పోర్టుతో తమ దేశానికి వచ్చినట్టు నిర్ధారించారు. అయితే అతని కుమారుడు నవీద్ అక్రమ్ మాత్రం ఆస్ట్రేలియన్ పత్రాలతో ప్రయాణించినట్టు సమాచారం.

తండ్రి–కొడుకులు నవంబర్ 1 నుంచి 28 మధ్య ఫిలిప్పీన్స్‌లో ఉండి, అక్కడ ‘సైనిక శైలిలో శిక్షణ’ పొందినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సాజిద్ అక్రమ్ భారతీయ పాస్‌పోర్టు వినియోగం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ముఖ్యంగా అక్రమ్ కుటుంబానికి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పందన కోరినట్టు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. దర్యాప్తు సంస్థలు పాస్‌పోర్టు నిజస్వరూపం, అది ఎలా జారీ అయింది, దుర్వినియోగం జరిగిందా అనే అంశాలపై పరిశీలన కొనసాగిస్తున్నాయి.

Related posts

పులివెందుల దెబ్బ.. ఏపీలో జగన్‌ మిస్సింగ్…!!

Satyam News

కొల్లాపూర్ లో కెనరా బ్యాంకు ప్రారంభం

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

Leave a Comment

error: Content is protected !!